Asianet News TeluguAsianet News Telugu

సహజీవనానికి కనీస వయస్సు 18 ఏళ్లే.. తగ్గించే యోచన లేదన్న కేంద్రం

సహజీవనం చేయాలంటే ప్రస్తుతం ఉన్న కనీసం 18 ఏళ్ల వయస్సు నిబంధనలో ఎటువంటి మార్పులేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సహజీవన కనీస వయస్సును తగ్గించే ఉద్దేశంలేదని  మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
 

The government is not considering any proposal to reduce the age of consent for consensual relationships from 18 to 16
Author
First Published Dec 22, 2022, 5:16 AM IST

ఏకాభిప్రాయంతో సహజీవనం చేయాలంటే ప్రస్తుతం ఉన్న కనీస వయస్సు 18ఏళ్ల నిబంధనలో ఎటువంటి మార్పులేదని కేంద్రం బుధవారం తెలిపింది. సహజీవనం చేయాలనుకునేవారి కనీస వయస్సు 18 నుండి 16 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని కేంద్ర మహిళా , శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డబ్ల్యుసిడి) బుధవారం పార్లమెంటుకు తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వానికి సహజీవన కనీస వయస్సును తగ్గించే ఉద్దేశంలేదని  మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

స్మృతి ఇరానీ ఏం చెప్పింది

లైంగిక వేధింపులు , లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడానికి 2012 లో రూపొందించిన లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం .. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిని పిల్లలుగా స్పష్టంగా నిర్వచించిందని కేంద్ర మంత్రి చెప్పారు. నేరస్తులను అరికట్టడానికి, పిల్లలపై అలాంటి నేరాలు జరగకుండా నిరోధించడానికి పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్షతో సహా మరింత కఠినమైన శిక్షను అందించడానికి 2019 లో చట్టాన్ని మరింత సవరించినట్లు ఆయన చెప్పారు.

మంత్రి స్మృతి ఇరానీ ఇంకా మాట్లాడుతూ.. మైనర్లు నేరాలకు పాల్పడితే.. పోక్సో చట్టం లోని సెక్షన్ 34 ప్రకారం.. ప్రత్యేక కోర్టు కేసులు విచారిస్తుందని తెలిపారు. ప్రత్యేక కోర్టు ద్వారా వయస్సును నిర్ణయించే ప్రక్రియను జరుగుతుందని మంత్రి చెప్పారు. 1999లో సవరించిన మెజారిటీ చట్టం-1875 ప్రకారం మెజారిటీ సాధించేందుకు 18 ఏళ్లు పూర్తి కావాలని తెలిపారు.

పెరుగుతున్న బాల్య వివాహాలు

బాల్య వివాహాలపై మరో లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం బాల్య వివాహాల కేసులు సంవత్సరాలుగా పెరిగాయని తెలిపారు. బాల్య వివాహాలపై  అవగాహన ఉన్న కేసులు పెరగడం విచారకరమన్నారు.2019లో 523, 2020లో 785, 2021లో 1050 బాల్య వివాహాలు నమోదయ్యాయని తెలిపారు.కేసులను ఎక్కువగా నివేదించడం అనేది బాల్య వివాహాల సంఖ్య పెరుగుదలను సూచించాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి సంఘటనలను నివేదించడానికి బేటీ బచావో బేటీ పడావో (BBBP), మహిళా హెల్ప్‌లైన్ (181) వంటి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios