lok Sabha security breach : లోక్ సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందులో పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వాస్తవానికి మొదట నిందితులు మొదట లోక్ సభలో ఆత్మాహుతి దాడి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఓ కారణంతో వారు ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇంతకీ ఆ కారణం ఏంటంటే ?
lok Sabha security breach : లోక్ సభలో భద్రతా ఉల్లంఘన యావత్ దేశాన్ని ఒక్క సారిగా ఉలిక్కిపడేలా చేసింది. పటిష్టమైన భద్రతా ఉండే పార్లమెంట్ లో ఇలా జరగడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే ఘటనలో ప్రధాన నిందితులు మొదట ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసిరట. కానీ చివరి నిమిషంలో నిందితులు ప్లాన్ ను మార్చుకున్నారు.
ఈ సంచలన విషయాన్ని ఈ కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝా పోలీసుల విచారణలో వెల్లడించాడని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. తాను, బృందంలోని ఇతర సభ్యులు పార్లమెంటు లోపల, వెలుపల ఆత్మహుతి చేసుకోవాలని తొలుత అనుకున్నామని, అయితే 'ఫైర్ రిటార్డెంట్ జెల్' ను కొనుగోలు చేయలేకపోయినందున ఆ ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చిందని విచారణలో ఒప్పుకున్నాడు.
అయితే స్మోక్ డబ్బాల మోహరింపు ప్రణాళికాబద్ధంగా జరిగిందని, ఇదే ప్లాన్ బి అని లలిత్ ఝా స్పష్టంగా చెప్పాడు. అంతేకాక అతడు ఉద్దేశపూర్వకంగానే తన సహ కుట్రదారుల మొబైల్ ఫోన్లను తగలబెట్టి, నాశనం చేసినట్టు అంగీకరించాడు. ఇది కుట్రలో అతను ప్రధాన పాత్ర పోషించాడనే ఢిల్లీ పోలీసుల అనుమానానికి బలం చేకూరుస్తుంది. కలకత్తా ప్రాంతంలో ఆయన ట్యూషన్ క్లాసుల నిర్వహించేవాడు. అందుకే అక్కడ అతడిని అందరూ 'మాస్టర్జీ' అని పిలిచేవారు.
కాగా.. నిందితుడికి శత్రుదేశం లేదా ఉగ్రవాద సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? లేవా అని తెలుసుకునేందుకు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. భద్రతా ఉల్లంఘన నేపథ్యంలో అతడి కదలికలను తిరిగి గుర్తించడానికి రాజస్థాన్ కు తరలించాలని అధికారులు యోచిస్తున్నారు. లోక్ సభలో భద్రతా ఉల్లంఘన జరిపిన తరువాత నిందితుడు రాజస్థాన్ కు పారిపోయి అక్కడ రెండు రోజులు ఉన్నాడు. తరువాతి రోజు రాత్రి ఢిల్లీకి తిరిగి వచ్చాడని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు ‘టైమ్స్ నౌ’తో తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో నిందితులైన సాగర్ శర్మ, మనోరంజన్ డి, నీలం దేవి, అమోల్ షిండే అనే ఐదుగురు వ్యక్తులు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి ఇదొక్కటే మార్గమని భావించారు. మీడియా దృష్టిని ఆకర్షించి రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే వీరిలో సాగర్ శర్మ, మనోరంజన్ డిలను లోక్ సభ ఛాంబర్ లోపల అరెస్టు చేయగా, నీలం దేవి, అమోల్ షిండేలను పార్లమెంటు భవనం వెలుపల అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి లలిత్, మహేష్ స్వచ్ఛందంగా కార్తవ్య పథ్ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించి లొంగిపోయారు.
