Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో కాంగ్రెస్ ఉచిత హామీల ఖరీదు రూ.62,000 కోట్లు!

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయానికి ముఖ్య కారణం పెద్ద ఎత్తున కురిపించిన ఉచిత హామీలే.. అయితే.. కాంగ్రెస్ ప్రకటించిన ఉచిత హామీలు అమలు చేయడానికి ఏడాదికి రూ.62,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అంటే..రాష్ట్ర బడ్జెట్ లో 20 శాతం సోమ్మును వీటి కోసమే వెచ్చించాల్సి ఉంటుందంట. 

The cost of Congress's free guarantees in Karnataka is Rs.62,000 crore KRJ
Author
First Published May 16, 2023, 5:46 AM IST

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని ఢీకొట్టి విజయం వెనుక చాలా కారణాలున్నాయి. వీటిలో ఒకటి టెంప్టింగ్ వాగ్దానాల పర్వం కూడా. సరళమైన భాషలో చెప్పాలంటే.. ఉచిత హామీలు . అధికారంలోకి రాగానే ఈ హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్‌ ప్రజలకు వాగ్దానం చేసింది. అయితే.. వీటిని పూర్తిగా అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర బడ్జెట్‌కు పెద్ద దెబ్బే పడుతుందని భావిస్తున్నారు.

మేనిఫెస్టోలో ప్రధానంగా ఐదు ఉచిత పథకాలు అమలు చేయడానికి ఏడాదికి రూ.62,000 కోట్లు వెచ్చించాల్సి రావచ్చు. ఒక అంచనా ప్రకారం.. ఇది రాష్ట్ర మొత్తం బడ్జెట్‌లో దాదాపు 20 శాతం. అయితే ఈ ఉచితాలకు రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతానికి మించి ఖర్చు చేయడం లేదని కాంగ్రెస్ చెబుతోంది.

వాగ్దానాల జాబితా...

కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పెద్ద పెద్ద వాగ్దానాలనే చేసింది. ఇవి మేనిఫెస్టోలో భాగమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కర్ణాటక ప్రజలకు గృహజ్యోతి యోజన కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుందని చెప్పింది. దీంతో పాటు గృహలక్ష్మి పథకం కింద ఒక్కో కుటుంబ పెద్దకు రూ.2వేలు అందిస్తామని హామీ ఇచ్చింది. బిపిఎల్ కార్డు ఉన్న కుటుంబాలకు అన్న భాగ్య యోజన కింద 10 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది.

ఇక యువ నిధి కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌కు రూ.3,000 అందజేస్తామనీ, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లు నెలకు రూ.1500 ఇస్తామని వాగ్దానం చేసింది. అలాగే.. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని తెలిపింది.ఇతర వాగ్దానాలలో డీప్ సీ ఫిషింగ్ కోసం ప్రతి సంవత్సరం 500 లీటర్ల పన్ను రహిత డీజిల్, లాక్‌డౌన్ సమయంలో మత్స్యకారులందరికీ లీన్ పీరియడ్ అలవెన్స్‌గా రూ.6,000 ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్.  

ప్రతి సంవత్సరం 62,000 కోట్లు ఖర్చు.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ హామీలన్నింటిని నేరవేర్చలంటే..(నగదు చెల్లింపు,విద్యుత్ సబ్సిడీ) ప్రతి సంవత్సరం రూ.62,000 కోట్లు ఖర్చవుతుందని కొన్ని అంచనాలు సూచిస్తున్నాయి. వీటి భారం రాష్ట్ర ఖజానాపై పడనుంది. ఈ మొత్తం రూ.62,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 20 శాతం వీటి కోసమే వెచ్చించాల్సి వస్తుంది. వాగ్దానాల అమలుకు ఉచితాల కోసం వెచ్చించిన మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటుతో సమానం. 2023-24కి కర్ణాటక బడ్జెట్ 2022-23కి రెవెన్యూ లోటు రూ.60,581 కోట్లుగా అంచనా వేసింది.
 
ఇదిలాఉంటే.. ఈ హామీలను నెరవేర్చడంలో పెద్దగా భారం ఉండదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. ఈ ఉచితాలు రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతానికి మించవు. ఇది కాకుండా.. వచ్చే ఐదేళ్లలో బడ్జెట్ పరిమాణాన్ని పెంచే అంచనాను ఆయన వ్యక్తం చేశారు.

బీజేపీ హయంలో కర్నాటక ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. బిజెపి ప్రభుత్వం రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అన్ని పెద్ద రాష్ట్రాల కంటే GST వసూళ్లలో కర్ణాటక అత్యధిక వృద్ధి రేటును సాధించింది. 2022-23లో ఆదాయ సేకరణ లక్ష్యాన్ని రూ.72,000 కోట్లుగా ఉంచారు. జనవరి వరకు రూ.83,010 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో జీఎస్టీ పరిహారం మొత్తం ఉండదు. ఈ మొత్తం బడ్జెట్ అంచనా కంటే 15 శాతం ఎక్కువ.

Follow Us:
Download App:
  • android
  • ios