53యేళ్ల ఓ మహిళ మృతదేహం ఆమె ఇంట్లోనే ప్లాస్టిక్ కవర్లో చుట్టి దొరికింది. దీంతో ఆమె కూతురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ముంబై : ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బుధవారం నాడు ఓ ఇంట్లోని కప్ బోర్డులో 53 ఏళ్ల మహిళ మృతదేహం లభించింది. ఆ మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి, ఇంట్లోని బట్టల అలమారాలో నెలల తరబడి ఉంచారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో మహిళ 21 కుమార్తెను పోలీసులు విచారణ కోసం తీసుకున్నారు.

మృతురాలి సోదరుడు, మేనల్లుడు మంగళవారం కాలాచౌకి పోలీస్ స్టేషన్‌లో మహిళ అదృశ్యమైందన్న కేసు నమోదు చేశారు. వారి ఫిర్యాదును మేరకు కేసు నమోదు చేసినట్లు డీసీపీ ప్రవీణ్ ముండే తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. మహిళ నివాసమైన మొదటి అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లో వెతకగా, ప్లాస్టిక్ బ్యాగ్‌లో మహిళ కుళ్ళిపోయిన మృతదేహం కనిపించింది.

హెచ్3ఎన్2 వైరస్ కలకలం.. మహారాష్ట్రలో తొలి అనుమానిత మృతి..

పోలీసులు మహిళ కుమార్తెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. హత్యకు గురైన వారి ఇళ్లలో మృతదేహాలు కనిపించిన అనేక సంఘటనలు గత కొన్ని నెలలుగా నివేదించబడ్డాయి. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య కేసులో, 28 ఏళ్ల ఆఫ్తాబ్ పూనావాలా తన జీవిత భాగస్వామిని చంపి, ఆమె శరీర భాగాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, ఆపై వాటిని ఒక్కొక్కటిగా నగరంలోని మెహ్రౌలీ అడవిలో చెల్లాచెదురు చేసాడు. 

ఇదిలా ఉండగా, బెంగళూరులోని రైల్వే స్టేషన్‌లో సోమవారం ఓ డ్రమ్ములో మహిళ మృతదేహం కలకలం రేపింది. రైల్వే స్టేషన్‌ ద్వారం దగ్గర ఓ మహిళ మృతదేహం ప్లాస్టిక్ డ్రమ్ములో లభ్యమైంది. ఇలా బెంగళూరు రైల్వే స్టేషన్‌లో డ్రమ్‌లో మృతదేహం దొరకడం ఈ యేడాది ఇది రెండో ఘటన. ఇది సోమవారం నాడు వెలుగులోకి వచ్చింది.

సోమవారం ఉదయం 10 -11 గంటల మధ్య బైయప్పనహళ్లి రైల్వే స్టేషన్‌లోని ఒక ప్రవేశ ద్వారం దగ్గర ఒక డ్రమ్ము అనుమానాస్పదంగా కనిపించింది. మూత బిగించి ఉంది.. తెరిచి చూస్తే అందులో పైన బట్టలు కనిపించాయి. అనుమానంతో లోపల చెక్ చేయగా ఓ మహిళ మృతదేహం కనిపించింది. ఆమె వయసు దాదాపు 31 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని గుర్తించారు. ఆ మహిళ ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉంది.

విషయం తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దీనిమీద కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. రైల్వే స్టేషన్ లోని సీసీ టీవీ ఫుటేజీలో ముగ్గురు వ్యక్తులు సోమవారం ఆటోరిక్షాలో ఈ డ్రమ్మును తీసుకువచ్చి రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం సమీపంలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని మచిలీపట్నం నుంచి రైలులో తరలించినట్లు వారి విచారణలో తేలింది. 

మచిలీపట్నానికి బృందాన్ని పంపామని, అయితే మృతదేహాన్ని గుర్తించలేకపోయామని రైల్వే పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సౌమలత తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం, జనవరి 4న యశ్వంతపూర్ రైల్వే స్టేషన్‌లో క్లీనింగ్ సిబ్బంది 20 ఏళ్లు పైబడిన మహిళ కుళ్లిపోయిన మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో గుర్తించారు.