LIC IPO:  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపివో) లో భారీ స్కామ్ ఉంద‌నీ వామ‌పక్ష పార్టీలు ఆరోపిస్తూ.. ప్ర‌భుత్వం తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మానిటైజేషన్ విధానం, ప్రభుత్వ రంగ యూనిట్ల  ప్ర‌యివేటీక‌ర‌ణ చేయ‌డం, జాతీయ ఆస్తులన్నింటినీ విక్రయించడం విచారకరమ‌ని పేర్కొన్నారు.  

LIC IPO-opposition parties: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ని ఐపీవోకు తీసుకువ‌చ్చి.. కొంత వాటాను విక్ర‌యించాల‌ని ప్ర‌భుత్వం చూస్తోంది. ఇప్ప‌టికే ఐపీవోకు సంబంధించి తేదీల‌ను సైతం ప్ర‌క‌టించింది. అయితే, ఎల్ఐసీ షేర్ల విక్ర‌యంపై ప్ర‌తిప‌క్షాల నుంచి వ్య‌తిరేకత వ‌స్తున్న‌ది. ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ మెరుగైన స్థానంలో ఉండి.. మంచి వృద్ధిలో ముందుకు సాగుతున్న క్ర‌మంలో దాని షేర్ల‌ను విక్ర‌యించాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నాయి. ప్ర‌భుత్వం తీరును వామ‌ప‌క్ష పార్టీలు ఖండిస్తున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపివో) లో భారీ స్కామ్ ఉంద‌నీ వామ‌పక్ష పార్టీలు ఆరోపిస్తూ.. ప్ర‌భుత్వం తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి రాజా.. ఎల్ఐసీ షేర్ల విక్ర‌యం గురించి స్పందిస్తూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మానిటైజేషన్ విధానం, ప్రభుత్వ రంగ యూనిట్ల ప్ర‌యివేటీక‌ర‌ణ చేయ‌డం, జాతీయ ఆస్తులన్నింటినీ విక్రయించడం విచారకరమ‌ని పేర్కొన్నారు.

భార‌తీయ జనతా పార్టీ (బీజేపీ)నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వం మానిటైజేషన్ విధానం ద్వారా ప్ర‌భుత్వ ఆస్తులను విక్రయించడానికి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్ర‌యివేటీక‌రించ‌డానికి చర్యలు తీసుకుంటోందని డి.రాజా అన్నారు. ప్రస్తుత ఖర్చులతో లాభాన్ని పొందేందుకు దీర్ఘకాలిక ఆస్తిని విక్రయించడం చాలా బాధాకరమైన విషయమ‌ని పేర్కొన్నారు. ఫెడరల్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ చర్య తీసుకుంటోంది ఎందుకంటే 'రైట్-వింగ్ US-మోడల్ ఎకనామిక్ పాలసీ'ని అనుసరించడం వల్ల కలిగే భారీ నష్టాలను పూడ్చేందుకు కార్పొరేషన్‌లకు పన్నులు పెంచడానికి తగినంత నిధులను సేకరించడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ విధంగా ప్రభుత్వ కంపెనీల వాటాల విక్రయం దేశీయ కంపెనీలకు మాత్రమే కాకుండా విదేశీ కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది కానీ దేశ ప్ర‌జ‌ల‌కు కాదు.. ఇది దేశ సార్వభౌమత్వాన్ని, ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) షేర్ల విక్ర‌యాన్ని ప్ర‌భుత్వం వెంట‌నే విర‌మించుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సైతం ప్ర‌భుత్వ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. "ఎల్‌ఐసీ షేర్ల విక్రయం అతిపెద్ద కుంభకోణం. ఇది ప్రజల వనరులను దోచుకునే చర్య. LIC 1956 నుండి భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అతిపెద్ద ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు కోటి 35 లక్షల రూపాయలు అందించింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ప్ర‌యివేటు కంపెనీల లాభాలను పెంచడానికి ఈ నిధులను ఇప్పుడు విదేశీ ఆర్థిక నిర్వాహకులు నిర్వహిస్తారు" అని పేర్కొన్నారు. దేశం, దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, ఎల్‌ఐసీ షేర్ల విక్రయానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. షేర్లు విక్రయించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని అన్నారు. కాగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) మే 4న ప్రారంభమై మే 9న ముగుస్తుందని ప్రభుత్వ వ‌ర్గాలు సోమవారం ప్రకటించాయి. ప్ర‌భుత్వం 5 శాతం వాటాలు విక్రయిస్తామని మొదట డ్రాఫ్ట్ పేపర్స్‌లో వెల్లడించింది. అయితే, ప్ర‌స్తుతం వివ‌రాల ప్ర‌కారం ప్రభుత్వం ఎల్ఐసీ IPO పరిమాణాన్ని 1.5 శాతం లేదా దాదాపు 9.4 కోట్ల షేర్లను తగ్గించింది. ఎల్‌ఐసీ బోర్డు ఇష్యూ పరిమాణాన్ని 3.5 శాతంగా నిర్ణ‌యించింది.