ఓ బ్యాంక్ మేనేజర్ ఫుల్లుగా తాగి, కారును రోడ్డుపై నిలిపి నిద్రపోయాడు. దీంతో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ లో చోటు చేసుకుంది. 

ఆయనో ఓ ప్రైవేట్ బ్యాంక్ ఫైనాన్స్ మేనేజర్. మధ్యాహ్నం సమయంలో ఫుల్లుగా తాగి కారు డ్రైవింగ్ చేశాడు. అయితే మత్తు ఎక్కడంతో డ్రైవింగ్ లో నిద్ర వచ్చేసింది. దీంతో రోడ్డుపైనే కారు ఆపి గుర్రుగా నిద్రపోయాడు. దీని వల్ల వెనకాల నుంచి వచ్చే వాహనాలన్నీ ఆగిపోయాయి. ఇలా ఐదు కాదు పది కాదు.. ఏకంగా ముప్పై నిమిషాల పాటు అలాగే నిద్రపోయాడు. నిద్రలేపేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా ఆయన మేలుకోలేదు. ఈ విచిత్ర ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ లో చోటు చేసుకుంది.

సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై సన్మానాన్ని తిర‌స్క‌రించిన‌ స్వీడన్ టెన్నిస్ దిగ్గజం జోర్న్ బోర్గ్.. ఎందుకంటే..?

కోయంబత్తుర్ శివార్లలోని వాగరాయంపాళయానికి చెందిన 30 ఏళ్ల ఎస్ రంజిత్ సాయిబాబా కాలనీలోని ఓ బ్యాంకులో ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన మంగళవారం మధ్యాహ్నం కవుందంపాళయం సమీపంలోని మెట్టుపాళయం ప్రధాన రహదారిలోని ఒక లేన్‌లో తన కారును పార్క్ చేసి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో అర గంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోయిందని పోలీసులు తెలిపినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం నివేదించింది. 

జవాన్ హత్యపై బీజేపీ నిరసనలో పాల్గొన్న ఆర్మీ వెటరన్స్.. సీఎం ఎందుకు ఖండించలేదని ప్రశ్నించిన అన్నామలై..

కారు రోడ్డుకు మధ్యలోనే నిలిపివేయడంతో కొంత సమయంలోనే ఆ లేన్ లో వెళ్లే వాహనాలన్నీ ఆగిపోయాయి. దీంతో పలవురు వాహనదారులు తమ వాహనాల్లో నుంచి దిగి కారుకు ఏమైందో అని వచ్చి చూశారు. డ్రైవర్ గాఢ నిద్రలో ఉన్నట్లు వారు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. రంజిత్ ను 30 నిమిషాల పాటు నిద్ర లేపేందుకు వారంతా ప్రయత్నించినా అవేవీ ఫలించలేదు. రంజిత్ కారును లోపలి నుండి లాక్ చేసుకున్నాడు. వాహనదారులు అతడిని లేపేందుకు ప్రయత్నించినా అవి సాధ్యం కాలేదు. కొందరు వాహనదారులు డ్రైవర్ చనిపోయి ఉంటాడని అనుమానించారు. 

ఇంతలో ఓ సిటీ ట్రాఫిక్ పోలీసు అక్కడికి వచ్చి కారు డ్రైవర్‌ని నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో కొందరు వాహనదారులు వారి వద్ద ఉన్న కొన్ని పరికరాల సాయంతో గాజు కిటికీని తెరవడానికి ప్రయత్నించారు. కానీ పెద్దగా విజయం సాధించలేదు. చివరికి ఓ వాహనదారుడు డ్రైవర్ వైపు ఉన్న గాజు కిటికీని పగలగొట్టి తలుపు తెరిచారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. తరువాత పోలీసులు ఇతర వాహనదారులతో కలిసి నిద్రలేపి రంజిత్ ను కారులో నుంచి దింపారు. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉండటం వల్ల సరిగ్గా నిలబడలేకపోయాడు. వాహనదారుల్లో ఒకరు రంజిత్ కారును రోడ్డు పక్కకు తరలించి, ఇతర వాహనాలకు వెళ్లేందుకు దారి క్లియర్ చేశారు.

పాకిస్థాన్ ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టారు.. వైరల్ అవుతున్న ‘‘26/11 అటాకర్స్’’ వ్యాఖ్యలపై జావేద్ అక్తర్

ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ ఎనలైజర్ ఉపయోగించి రంజిత్ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారించారు. ‘‘మేము అతడిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ చేశాం. అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాం. తరువాత అతడిని వారితో పంపించాం’’ అని పోలీసులు తెలిపారు. అయితే ట్రాఫిక్ నిలిచిపోయిన సమయంలో పలువురు ఈ విచిత్ర ఘటనను తమ మొబైల్స్ ద్వారా వీడియో తీశారు. ఇవి మంగళవారం సాయంత్రం నాటికి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.