Asianet News TeluguAsianet News Telugu

ఎస్పీ నాయకుడి 26 ఏళ్ల కూతురితో లేచిపోయిన 47 ఏళ్ల బీజేపీ నాయకుడు.. సస్పెండ్ చేసిన పార్టీ.. ఎక్కడంటే ?

ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లాకు చెందిన 47 ఏళ్ల బీజేపీ నాయకుడు ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ నాయకుడి కూతురితో లేచిపోయాడు. ఆమె వయస్సు 26 సంవత్సరాలు. కాగా బీజేపీ నాయకుడికి ఇది వరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

The 47-year-old BJP leader who got up with the 26-year-old daughter of the SP leader... where is the suspended party?
Author
First Published Jan 18, 2023, 4:45 PM IST

ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. 47 ఏళ్ల బీజేపీ నాయకుడు సమాజ్ వాదీ పార్టీ నాయకుడి 26 ఏళ్ల కూతురితో లేచిపోయాడు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీజేపీ నేత తమ కూతురిని ప్రలోభపెట్టి తీసుకెళ్లాడని ఆరోపించారు. అయితే ఆ నాయకుడిపై కేసు నమోదు కావడంతో బీజేపీ అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది.

పిల్లలపై క‌రోనా దెబ్బ‌.. ప్రాథమిక పఠన సామర్థ్యం గణనీయంగా తగ్గింది: ASER నివేదిక

అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం.. బీజేపీ నాయకుడిని ఆశిష్ శుక్లాగా గుర్తించారు. అతడికి ఇప్పటికే వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో కుమారుడి వయస్సు 21 సంవత్సరాలు కాగా.. కూతురు వయస్సు 7 సంవత్సరాలు. కొత్వాలి నగరంలోని మొహల్లాలో నివాసం ఉండే అతడు కొంత కాలం నుంచి సమాజ్ వాదీ పార్టీ నాయకుడి కూతురితో ప్రేమలో ఉన్నాడు.

అసహజ శృంగారం వద్దన్నందుకు భార్యను విడిచిపెట్టిన ఎన్నారై భర్త.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

అయితే ఇటీవల ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ ఆమెకు పెళ్లి ఇష్టం లేదు. దీంతో తన ప్రియుడితో కలిసి కుటుంబానికి దూరంగా పారిపోవాలని ఆమె నిర్ణయం తీసుకుంది. వీరిద్దరు ఒక్క సారిగా కనిపించకుండాపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు బీజేపీ నాయకుడిపై ఫిర్యాదు చేశారు.

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మార్చి 2న కౌంటింగ్.. పూర్తి వివరాలు ఇవే..

కాగా.. నిందితుడు ఆశిష్ శుక్లా పార్టీ నగర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని బీజేపీ హర్దోయ్ జిల్లా మీడియా ఇన్‌చార్జి గంగేష్ పాఠక్ మీడియాకు తెలిపినట్లు ‘ఐఏఎన్ఎస్’ నివేదించింది. ‘‘పార్టీ విధానానికి విరుద్ధంగా పని చేసినందుకు ఆశిష్‌ను పదవి నుంచి తొలగించారు. అతడి ప్రాథమిక సభ్యత్వాన్ని పార్టీ రద్దు చేసింది. శుక్లాకు పార్టీకి ఇకపై సంబంధం లేదు. అతడిపై చర్య తీసుకునే పూర్తి అధికారం పోలీసులకు ఉంది’’ అని గంగేష్ పాఠక్ అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios