అది మోడీ ఫంక్షన్.. రామమందిర ప్రారంభోత్సవంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం (ayodhya ram mandir opening)ప్రధాని నరేంద్ర మోడీ ఫంక్షన్ (Prime Minister Narendra Modi function)అని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul gandhi)విమర్శించారు. అది రాజకీయ కార్యక్రమం అని పేర్కొంటూ పలువురు హిందూ మత పెద్దలు కూడా ఆలయ ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని తెలిపారు.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని ‘మోడీ ఫంక్షన్’ అంటూ అభివర్ణించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. జనవరి 22 వేడుకలను ఆర్ఎస్ఎస్, బీజేపీ పూర్తిగా రాజకీయ నరేంద్ర మోడీ కార్యక్రమంగా మార్చాయని విమర్శించారు. అది ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫంక్షన్ అని, అందుకే కాంగ్రెస్ చీఫ్ ఆ కార్యక్రమానికి వెళ్లనని చెప్పారని తాను భావిస్తున్నానని అన్నారు.
పంజాబ్ సీఎంకు ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూన్ బెదిరింపు.. రిపబ్లిక్ డే రోజు దాడి చేస్తామని హెచ్చరిక..
అన్ని మతాలను తాము సమానంగానే చేస్తామని, అన్ని అచారాలను పాటిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. అయితే జనవరి 22వ తేదీన జరిగే ఈ కార్యక్రమం రాజకీయ కార్యక్రమమని హిందూ మతానికి చెందిన అధికారులు కూడా తమ అభిప్రాయాన్ని బహిర్గతం చేశారని తెలిపారు. కాబట్టి భారత ప్రధాని చుట్టూ, ఆర్ఎస్ఎస్ చుట్టూ రూపొందించిన ఈ రాజకీయ కార్యక్రమానికి వెళ్లడం తమకు కష్టమని ఆయన అన్నారు.
కాగా.. రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్ సభలో పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వానాన్ని సున్నింతంగా తిరస్కరిస్తున్నట్టు వారంతా ఇటీవల ప్రకటించారు. అది కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అని పేర్కొన్నారు.
అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య ఏం తేడా లేదు - రేవంత్ రెడ్డి..
ఇదిలావుండగా.. మకర సంక్రాంతి రోజున పవిత్ర అయోధ్య నగరంలో ప్రార్థనలు చేయాలని నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ విభాగం అమలు చేసింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్, ఇతర పార్టీ నేతలు సోమవారం (జనవరి 15) అయోధ్యలోని సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
వావ్.. మెగాస్టార్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన కలెక్టర్.. వీడియో వైరల్..
అయోధ్యలో జనవరి 22వ తేదీన జరిగే ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే మతకర్మలకు సంబంధించిన అధికారిక ప్రక్రియలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అవి జనవరి 21, 2024 వరకు కొనసాగుతాయి. అందులో భాగంగా నేడు (మంగళవారం) ప్రయశ్చిత, కర్మకుటి పూజన్ నిర్వహిస్తున్నారు, ఈ నెల 17న మూర్తి, పరిసార్ ప్రవేశ్, 18వ తేదీ సాయంత్రం సమయంలో తీర్థ పూజన్, జల యాత్ర, గంధాధివస్, 19వ తేదీన ఉదయం ఔషధాధివాస్, కేశరాధివాస్, ఘృతాధివాస్, 19వ తేదీన సాయంత్రం ధాన్యాధివస్, 20వ తేదీన ఉదయం శర్కరాధివాసులు, ఫలాధివాసులు.. అదే రోజు సాయంత్రం, పుష్పాధివస్, 21వ తేదీ ఉదయం మధ్యాధివాస్, 21వ తేదీ సాయంత్రం శయ్యాధివాసులు నిర్వహించనున్నారు.