పిల్లలు పక్క తడపడం మామూలే.. అయితే దాన్ని సాకుగా చూపించి ఓ చిన్నారిని కన్నతండ్రే చిత్రహింసలు పెట్టాడు. ఈ అమానుష ఘటన ముంబైలో వెలుగు చూసింది. 

వివరాల్లోకి వెడితే.. థానేలోని వాగ్లేకర్ ఎస్టేట్స్ లో ఓ వ్యక్తి తన రెండో భార్యతో కలిసి మొదటి భార్య కొడుకును చిత్రహింసలు పెట్టాడు. తొమ్మిదేళ్ల ఆ చిన్నారి నిద్రలో పక్కలో పాస్ పోశాడని అతనిమీద అమానుషంగా వ్యవహరించాడు. 

రెండోభార్య, భర్త కలిసి చితకబాది పైశాచికానందం పొందారు. అంతేకాకుండా ఆ చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ పై వాతలు పెట్టారు. దీంతో ఆ చిన్నారి బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ ఘటన మీద మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.