ముంబై:మహారాష్ట్రలోని భీవండిలో పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలను పోలీసులు సీజ్ చేశారు. కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు గోడౌన్ పై దాడి చేసి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకొన్నారు. థానే  క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ పేలుడు పదార్ధాలను సీజ్ చేశారు. ఈ గోడౌన్ నుండి  12 వేల జిలెటిన్ స్టిక్స్, 3,008 డిటోనేటర్లను స్వాధీనం చేసుకొన్నారు. జిలెటిన్ స్టిక్స్ ను  60 బాక్స్‌ల్లో భద్రపర్చారు. ప్రతి బాక్స్ లో 190 జిలిటెన్ స్టిక్స్ ను భద్రపర్చారు. 

భీవండికి సమీపంలోని కారివలి గ్రామంలోని గోడౌన్ లో ఈ పేలుడు పదార్ధాలను భద్రపర్చారు. ఈ పేలుడు పదార్ధాలను అక్రమంగా భద్రపర్చిన కేసులో గురునాథ్ కాశీనాథ్ మఠ్రే అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు భవన నిర్మాణ సప్లయర్ గా ఉన్నాడు. రెండు  రూమ్‌ల్లో ఈ పేలుడు పదార్ధాలను భద్రపర్చారని పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడికి కోర్టు ఈ నెల 22వరకు రిమాండ్ విధించిందని పోలీసులు చెప్పారు. పేలుడు పదార్ధాలను  సీజ్ చేసి భద్రపర్చినట్టుగా పోలీసులు ప్రకటించా