Asianet News TeluguAsianet News Telugu

కాశ్మీర్‌లో ఉగ్రదాడులు.. రాజౌరిలో కాల్పుల్లో ముగ్గురు పౌరుల మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..

భారతదేశం-పాకిస్తాన్ నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న రాజోరి జిల్లాలోని మైనారిటీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.  

Terrorist Attack In Rajouri Terrorists Firing On Four Civilians
Author
First Published Jan 1, 2023, 11:24 PM IST

కొత్త సంవత్సరం తొలిరోజే జమ్మూకశ్మీర్‌లో మూడు ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకున్నాయి. భారతదేశం-పాకిస్తాన్ నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న రాజౌరిలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది గాయపడ్డారు. ఇది కాకుండా.. సాయంత్రం శ్రీనగర్‌లోని హవాల్ చౌక్‌లో సీఆర్‌పీఎఫ్ 28వ బెటాలియన్ బంకర్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఇందులో ఓ పౌరుడు గాయపడ్డాడు. అలాగే.. ఆదివారం తెల్లవారుజామున పుల్వామాలోని రాజ్‌పోరా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్ నుంచి ఏకే-47 రైఫిల్‌ను లాక్కున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.  

వివరాల్లోకెళ్లే.. జమ్మూకశ్మీర్‌ రాజౌరీ జిల్లాలోని డాంగ్రీ అనే గ్రామంలో సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రామ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ముష్కరులు జరిపిన దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. తుపాకీ తూటాలతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజౌరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించడంతో అక్కడ గందరగోళం నెలకొంది.సమాచారం అందుకున్న బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించినట్లు అదనపు డీజీపీ ముఖేష్‌ సింగ్‌ తెలిపారు. మృతులను డాంగ్రీకి చెందిన దీపక్ కుమార్ (23), సతీష్ కుమార్ (45), అక్ష్మాన్, ప్రీతమ్ లాల్ (56)గా గుర్తించారు. గత రెండు వారాల్లో జిల్లాలో పౌరులు హత్యకు గురవడం ఇది రెండోసారి. ఇంతకు ముందు డిసెంబరు 16న రాజౌరిలోని సైనిక శిబిరం వద్ద జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

రెండో ఉగ్రవాద ఘటన : శ్రీనగర్‌లో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రెండో ఉగ్రవాద ఘటన జరిగింది. హవాల్ చౌక్‌లో సీఆర్పీఎఫ్ 28వ బెటాలియన్ బంకర్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో జవాన్లకు ఎటువంటి హాని జరగలేదు, అయితే సాధారణ పౌరుడు సమీర్ అహ్మత్ మల్లా గాయపడ్డారు. అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై ఎలాంటి అధికార సమాచారం వెలువడలేదు.  

మూడో ఘటన: పుల్వామాలో చోటుచేసుకుంది. దక్షిణ కాశ్మీర్‌ పుల్వామా జిల్లాలోని రాజ్‌పోరా ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 12:45 గంటలకు CRPF జవాన్ నుండి AK-47 రైఫిల్‌ను లాక్కున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి ఉగ్రవాదుల కోసం వెతుకులాట ప్రారంభించాయి. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ రైఫిల్‌ను లాక్కోవడంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

అయితే.. సాయంత్రానికి రైఫిల్‌ను లాక్కున్న యువకుడిని నుంచి అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఆయుధాన్ని తిరిగి ఇచ్చారు. రైఫిల్‌ను లాక్కున్న యువకుడిని 25 ఏళ్ల ఇర్ఫాన్ బషీర్ గాని గుర్తించారు. 183 బెటాలియన్‌కు చెందిన జవాన్‌ నుంచి ఉగ్రవాదులు ఏకే-47 రైఫిల్‌ను లాక్కెళ్లారు. సీఆర్‌పీఎఫ్‌ నుంచి రైఫిల్‌ లాక్కునేందుకు గల కారణాలను వెల్లడించలేదు.

ఉగ్రవాదులు

2022లో కాశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదులతో 93 ఎన్‌కౌంటర్లు జరిగాయి. వాటిలో 172 మంది ఉగ్రవాదులు మరణించారు. వీరిలో 42 మంది విదేశీయులున్నారు. అదే సమయంలో.. ఉగ్రవాదుల చేతిలో 29 మంది పౌరులను చంపబడ్డారు. వారిలో 6 మంది హిందువులు, ముగ్గురు కాశ్మీరీ పండిట్‌లు ఉన్నారు.  ఈ విషయాన్ని కాశ్మీర్‌ ఏడీజీపీ విజయ్‌ కుమార్‌ శుక్రవారం వెల్లడించారు. హతమైన ఉగ్రవాదుల్లో గరిష్టంగా 108 మంది ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందినవారని వెల్లడించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios