జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో సోమవారం సాయంత్రం ఉగ్ర దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు. 

జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ సోమవారం సాయంత్రం ఉగ్ర దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 14 మంది సాయుధ పోలీసు సిబ్బందికి గాయాలు కాగా.. ఇద్ద‌రు మృతి చెందారు. శ్రీనగర్‌లోని పంథా చౌక్ ప్రాంతంలోని జెవాన్ సమీపంలో 9 బెటాలియ‌న్‌కు చెందిన సిబ్బంది బ‌స్సులో ప్రయాణిస్తున్నారు. ఆ స‌మ‌యంలో ఒక్క సారిగా ఉగ్ర మూక‌లు ఈ బ‌స్సుపై దాడి చేశాయి. విచ‌క్ష‌ణా ర‌హితంగా బస్సుపై కాల్పులు జ‌రిపారు. అనుకోకుండా ఎదురైన ఘ‌ట‌న వ‌ల్ల సాయుధ ద‌ళాలు వారిపై తిరిగిదాడి చేయ‌లేక‌పోయాయి. దీంతో తీవ్ర గాయాల‌పాలైన ఇద్ద‌రు పోలీసులు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు. మ‌రో 14 మంది తీవ్రంగా గాయాల‌పాల‌య్యారు. వారిని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌ను జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ధృవీకరించారు. శ్రీనగర్ నుంచి తిరిగి వస్తుండగా పోలీసులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారని ఆయ‌న తెలిపారు. 

దేశ విభజనపై ఫ‌రూక్ అబ్దుల్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

బ‌స్సుపై ఉగ్ర‌దాడి త‌రువాత భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 366 మంది ఉగ్రవాదులు మరణించారు. 96 మంది పౌరులు, 81 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.