NIA Raid: టెర్రర్ ఫండింగ్ కేసులో భాగంగా జ‌మ్మూకాశ్మీర్ లోని పలు చోట్ల జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వ‌హిస్తోంది. శ్రీనగర్, షోపియాన్, పుల్వామా, అనంతనాగ్, కుల్గాం సహా కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయ‌నీ, టెర్రరిస్టు ఫండింగ్ పై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 

Terror funding case: ఉగ్రవాదానికి సంబంధించిన కేసు నేప‌థ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కాశ్మీర్ లోని ప‌లు ప్రాంతాల్లో సోదాలు నిర్వ‌హించింది. మంగ‌ళ‌వారం టెర్రర్ ఫండింగ్ కేసులో భాగంగా జ‌మ్మూకాశ్మీర్ లోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వ‌హిస్తోంది. శ్రీనగర్, షోపియాన్, పుల్వామా, అనంతనాగ్, కుల్గాం సహా కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయ‌నీ, టెర్రరిస్టు ఫండింగ్ పై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

వివిధ నకిలీ ప‌త్రాలు, నిబంధనలతో ఉగ్రవాద, విద్రోహ కార్యకలాపాలను నిర్వహించడానికి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు, వాటి సహచరులు, ఆఫ్-షూట్ కేడర్లు, ఓజీడబ్ల్యూలపై గత ఏడాది నమోదైన కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

డిజిటల్ పరికరం స్వాధీనం

శ్రీనగర్ లోని సలాఫియా మసీదు ఇక్బాల్ కాలనీ 90 ఫీట్ రోడ్ సౌరాలో తన సోదరుడితో కలిసి నివసిస్తున్న అబ్దుల్ రషీద్ తేలీ కుమారుడు జునైద్ అహ్మద్ తేలీ ఇంటిపై దర్యాప్తు సంస్థ అధికారులు దాడి చేశారు. ఈ సమయంలో ఓ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే, పుల్వామాలోని నీలోరాలో మహ్మద్ అల్తాఫ్ భట్ కుమారుడు జీషాన్ అల్తాఫ్, గులాం హుస్సేన్ మాలిక్ కుమారుడు ఆరిఫ్ మాలిక్ నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

కుల్గాంలో సోదాలు..

కుల్గాంలో, యారిపోరాలోని అల్తాఫ్ అహ్మద్ వాగే (దుద్వాలా), హంగర్ లో ఫరూక్ అహ్మద్ దార్ (రైతు), రాంపోరాలో హతమైన కమాండర్ అబ్బాస్ షేక్ సోదరుడు అష్రఫ్ అహ్మద్ షేక్ నివాసాలపై ఏజెన్సీ దాడులు చేసింది. ఈ క్ర‌మంలోనే ప‌లు కీల‌క అధారాల‌ను సేకరించార‌ని స‌మాచారం. గులాం ఖాదిర్ వైద్ కు చెందిన మగ్రే మొహల్లా అచబాల్ కుమారుడు ఉబైద్ అహ్మద్ ఇంట్లోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. జ‌మ్మూకాశ్మీర్ లోని ఇతర ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ కార్యాలయం జమ్మూలో ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ ఆర్సీ 5/2022లో నమోదైన కేసుకు సంబంధించి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

టెర్ర‌రిస్టు ఫండింగ్ కేసులో సోదాలు నిర్వ‌హిస్తున్న ఎన్ఐఏ బృందాల్లో పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. పుల్వామాకు చెందిన సర్తాజ్ అల్తాఫ్ భట్ అనే జర్నలిస్ట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భట్ లోకల్ న్యూస్ ఔట్ లెట్ గ్రోత్ కాశ్మీర్ లో పనిచేస్తున్నాడని సయీద్ వర్గాలు తెలిపిన‌ట్టు ఇండియా టూడే నివేదించింది.