గుల్మార్గ్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లకు గాయాలు

జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. కొన్ని గంటల ముందు గందర్‌బల్ జిల్లాలో ఓ కార్మికుడిపై కాల్పులు జరిపారు.

terror attack on army vehicle in jammu Kashmir gulmarg.. 5 soldiers injured GVR

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్ర దాడి జరిగింది. గుల్మార్గ్‌లో ఆర్మీ వాహనంపై తాజాగా జరిగిన దాడిలో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు జమ్ముకశ్మీర్‌లోని గందర్ బల్ జిల్లాలో ఓ కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం కలకలం రేపింది.

ఉత్తర కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లోని బోటాపతేర్ ప్రాంతంలో గురువారం రాత్రి ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై దాడి చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో కనీసం ఐదుగురు సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఒక కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి గాయపర్చిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. గాయపడిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రీతమ్ సింగ్‌గా బలగాలు గుర్తించాయి.

72 గంటల్లో రెండో దాడి...

జమ్మూ కశ్మీర్‌లో మూడు రోజుల క్రితం టెన్నెల్ నిర్మిస్తున్న కార్మికుల హౌసింగ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు నిర్మాణ కార్మికులు, ఒక వైద్యుడు మరణించారు. మరణించిన వారిని కశ్మీర్‌లోని నయీద్‌గామ్‌లోని బుద్గామ్‌కు చెందిన డాక్టర్ షానవాజ్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన గుర్మీత్ సింగ్‌గా గుర్తించగా... కూలీలు మహ్మద్ హనీఫ్, ఫహీమ్ నాసిర్, కలీం బీహార్‌కు చెందినవారుగా గుర్తించారు. మరో ఇద్దరు మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్‌ శుక్లా, జమ్మూకు చెందిన శశి అబ్రోల్‌లు అధికారులు గుర్తించారు. కాగా దాడి చేసిన ప్రాంతంలోని INSAS రైఫిల్‌ను దుండగుడు వదిలేసి వెళ్లాడు.

ఈ ఘటనపై కశ్మీర్‌కు నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. ఇది స్థానికేతర కార్మికులపై భయంకరమైన, పిరికి దాడి అన్నారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న నిరాయుధులైన అమాయక ప్రజలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 

కాగా, గందర్‌ బల్‌లో పౌరులపై జరిగిన దాడి అత్యంత దారుణమైంది. అక్టోబర్ 8 ఎన్నికల్లో విజయం సాధించిన అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే దాడి జరిగింది. ఆ మరుసటి రోజే కశ్మీర్‌లోని అనేక జిల్లాల్లో దాడులు జరిగిన బలగాలు తెహ్రీక్ లబాయిక్ యా ముస్లిం అనే కొత్త ఉగ్రవాద సంస్థను నిర్మూలించారు. శ్రీనగర్, గందర్‌బల్‌, బండిపోరా, కుల్గాం, బుద్గాం, అనంత్‌ నాగ్‌, పుల్వామా జిల్లాల్లో ఈ దాడులు జరిగాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు యువకులను సమీకరించడంలో చురుకుగా పాల్గొంటున్న తెహ్రీక్ లబాయిక్ యా ముస్లిం (TLM)కి చెందిన రిక్రూట్మెంట్ మాడ్యూల్‌ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా దాడులు చేసినట్లు కశ్మీర్‌ పోలీసులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios