జమ్మూకాశ్మీర్ లో తప్పిన భారీ ఉగ్రముప్పు .. 15 కిలోల పేలుడు పదార్థం నిర్వీర్యం..
ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్‌లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేస్తూ పోలీసులు 15 కిలోల ఐఈడీ , ఇతర పేలుడు పదార్థాలు,ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం బసంత్‌గఢ్‌లోని ఖండారా అడవుల్లో జరిపిన సోదాల్లో ఐఈడీతో పాటు నాలుగు వందల గ్రాముల ఆర్‌డీఎక్స్, ఏడు కాట్రిడ్జ్‌లు, డిటోనేటర్లు, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన లెటర్ ప్యాడ్ పేజీ కూడా లభ్యమయ్యాయి.బాంబు నిర్వీర్య దళం ఐఈడీని ధ్వంసం చేసింది.

జమ్మూకాశ్మీర్ లో భారీ ఉగ్రదాడి తప్పింది. జమ్మూలోని ఉధంపూర్ జిల్లాలో స్వాధీనం చేసుకున్న 15 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు మంగళవారం నిర్వీర్యం చేశారు.వాస్తవానికి డిసెంబర్ 26న ఉధంపూర్ లో ఐఈడీ,ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ పేలుడు పదార్తాలను పోలీసులు మంగళవారం నాడు నిర్వీర్యం చేశారు.
వివరాల్లోకెళ్లే.. ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్‌లోని ఖండారా అడవుల్లో సోమవారం నాడు సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో ఐఈడీ, 300-400 గ్రాముల ఆర్‌డీఎక్స్, 7.62 మిల్లీమీటర్ల ఏడు కాట్రిడ్జ్‌లు, ఐదు డిటోనేటర్లతో పాటు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీకి చెందిన లెటర్ ప్యాడ్ పేజీని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న ఐఈడీని మంగళవారం సురక్షితంగా నిర్వీర్యం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు. అలాగే బసంత్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో తీవ్రవాద కుట్రను భారీ కుట్ర భగ్నం అయినట్టు పోలీసులు భావిస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం, రికవరీ చేసిన స్టాక్ పాతదిగా కనిపిస్తుంది, దానిని గోనెలో చుట్టి దాచారు. లగేజీలో ఇద్దరు ఉగ్రవాదులు ఆయుధాలతో నిలబడి ఉన్న ఫోటో కూడా లభ్యమైంది. ఈ ఫొటో ఆధారంగా పోలీసులు ఉగ్రవాదులను వెతకడం ప్రారంభించారు. అదే సమయంలో.. పోలీసులు కస్టడీలో బసంత్‌గఢ్‌కు చెందిన అనుమానితుడిని ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే.. ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించబడలేదు.