భారత్, చైనా సరిహద్దు వెంబడి మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆగష్టు 29 రాత్రి పొద్దుపోయాక చైనా బలగాలు ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద ప్రస్తుత యథాతథ స్థితి ని ఉల్లంఘించేందుకు చైనా బలగాలు యత్నించగా దాన్ని భారత బలగాలు అడ్డుకున్నాయి. 

అధికారిక ప్రకటన అనుసారం.... "ఇంతకుముందు అంగీకరించిన యథాతథ స్థితిని ఉల్లంఘిస్తూ చైనా బలగాలు ముందుకు రావడంతో, భారతీయ సేనలు వారిని ముందుకు రానివ్వకుండా అడ్డుకున్నాయని" పేర్కొన్నారు. 

ప్యాంగ్యాంగ్ సరస్సు దక్షిణం వైపున చైనా బలగాలు ఈ దుశ్చర్యకు పాల్పడబోగా అప్రమత్తుమైన భారత బలగాలు వీరిని అడ్డుకున్నాయని అందులో పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో భారత సేన తమ పొజిషన్స్ ని మరింత కట్టుదిట్టం చేసినట్టు సైన్యం అధికారిక వర్గాలు తెలిపాయి. 

చర్చల ద్వారా శాంతిని నెలకొల్పేందుకు ఆర్మీ కట్టుబడి ఉందని, అదే సమయంలో భారత భూభాగాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నామని సైన్యం తెలిపింది. భారత్, చైనా ల మధ్య ఇప్పటికే దాదాపుగా 5 సార్లు ఈ విషయానికి సంబంధించి అధికారుల మధ్య చర్చలు జరిగినప్పటికీ.... ఇప్పటికి కూడా సరిహద్దు వెంబడి శాంతియుత పరిస్థితులు కనబడడం లేదు. ఇంకా ఏదో ఒకచోట ఉద్రిక్తితలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 

ఇకపోతే... గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా సైనికుల చేతిలో 20 మంది భారతీయులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వాస్తవాలేంటీ..? సోమవారం రాత్రి గాల్వాన్‌ లోయ వద్ద ఏం జరిగింది..? ఒక్క తుపాకీ గుండు కూడా పేలకుండానే మనదేశం వైపు 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా భారీ సంఖ్యలో సైనికులు క్షతగాత్రులవ్వడం సాధారణ విషయం కాదు. 

అయితే భారత సైన్యంపై దాడికి చైనా సైన్యం ఇనుప చువ్వలు బిగించిన ఐరన్ రాడ్లను ఉపయోగించినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పొడవాటి ఇనుప కడ్డీలకు చివరన మేకుల్లాంటి ఇనుప చువ్వలను వెల్డింగ్ చేసి ఉన్న ఫోటోలను ప్రముఖ రక్షణ రంగ నిపుణులు అజయ్ శుక్లా ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు.

గాల్వాన్ ఘర్షణ జరిగిన ప్రదేశంలో భారత సైన్యం ఈ ఫోటోలు తీసినట్లు ఆయన తెలిపారు. ఆర్మీలో కల్నల్‌గా సేవలందించిన అజయ్ శుక్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్నో విషయాలను గతంలో వెలుగులోకి తీసుకొచ్చారు. 

ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించిన ఆయన.. ఇది సైనిక చర్య కాదని కుట్ర, నేరపూరిత చర్యగా అభివర్ణించారు. ఇనుప చువ్వల తయారీని బట్టి చైనా పక్కా వ్యూహాంతోనే భారత సైన్యంపై దాడికి పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోందని అజయ్ అన్నారు. కొందరు సైనికులు చెప్పిన విషయం ప్రకారం భారత జవాన్లను, చైనా సైనికులు తమ భూభాగంలోకి లాక్కెళ్లారని... ఇంకొందరు కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లను విసరారని తెలిపారు.