జంతర్ మంతర్ వద్ద  రెజర్లు  ఆందోళనకు దిగారు.  రెజర్లు  పార్లమెంట్  భవనం వైపునకు వెళ్లేందుకు  ప్రయత్నించారు.  అయితే  పోలీసులు వారిని అడ్డుకున్నారు.  దీంతో  ఉద్రిక్తత  చోటు  చేసుకుంది. 

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారంనాడు రెజర్ల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జంతర్ మంతర్ నుండి కొత్త పార్లమెంట్ భవనం వైపునకు రెజర్లు ప్రదర్శనగా వెళ్లే ప్రయత్నం చేశారు. రెజర్లను పోలీసులు అడ్డుకున్నారు. జంతర్ మంతర్ వద్ద రోడ్డుకు అడ్డుగా పెట్టిన బారికేడ్లను రెజర్లు తోసివేశారు. ఈ సమయంలో రెజర్లు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

తమ డిమాండ్ల సాధన కోసం 35 రోజులుగా రెజర్లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రెజ్లింగ్ పెడరేషన్ ఆఫ్ ఇండియా అ్క్షుడు బ్రిజ్ భూషన్ పై మహిళ రెజర్లు ఆరోపణలు చేశారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని తొలుత ఈ ఏడాది జనవరి మాసంలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. మహిళ రెజర్లు చేసిన ఆరోపణల నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ పై ఈ ఏడాది ఏప్రిల్ 28న రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన విషయం తెలిసిందే .