Manipur violence: ఇంఫాల్ కు దక్షిణంగా 50 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్ జిల్లా తేరా ఖోంగ్ ఫాంగ్ బి సమీపంలో  ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన పోలీసు సిబ్బందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Fresh violence in Manipur, cop killed: మ‌ణిపూర్ లో మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. అనుమానిత ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. దీంతో ఇటీవ‌ల మొద‌లైన గిరిజ‌న‌, గిరిజ‌నేత‌ర ఘ‌ర్ష‌ణ‌లు కాస్త త‌గ్గుతున్న క్ర‌మంలో ఈ కాల్పులు మ‌రోసారి క‌ల‌కలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఇంకా ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నెల 13 వరకు ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఇంఫాల్ కు దక్షిణంగా 50 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్ జిల్లా తేరా ఖోంగ్ ఫాంగ్ బి సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన పోలీసు సిబ్బందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల హింస చెలరేగిన టోరిబంగ్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం నుంచి ఉగ్రవాదులను ఏరివేసేందుకు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఇదిలావుండగా, టోరిబంగ్ లో ఇద్దరు వ్యక్తులను అనుమానిత ఉగ్రవాదులు అపహరించుకుపోయారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వీరిద్దరూ తమ ఇంటి నుంచి ఆహారధాన్యాలు తీసుకురావడానికి వెళ్లగా అపహరణకు గురయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్ కు నిరసనగా మే 3న కొండ జిల్లాల్లో 'ట్రైబల్ సాలిడారిటీ మార్చ్' నిర్వహించిన తరువాత ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. లాక్ డౌన్ విధించిన 11 జిల్లాల్లో కర్ఫ్యూను గతంలో ఉన్న ఐదు గంటల నుంచి ఆరు గంటలు సడలించినట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో కర్ఫ్యూ సమయాలు మారుతూ ఉంటాయి. దిమాపూర్ నుంచి ఇంఫాల్ కు నిత్యావసర సరుకులతో వెళ్తున్న 100 ట్రక్కులను ఉత్తర కాంగ్పోక్పి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అల్లరిమూకలు అడ్డుకున్నాయి. 

కాగా, హింసాకాండతో అతలాకుతలమైన మణిపూర్ ను వదిలి వెళ్లేందుకు ప్రజలు పరుగులు తీస్తుండటంతో వన్ వే విమాన టికెట్ ధర రూ.20,000 చేరుకున్నాయి. చాలా మంది రాష్ట్ర ప్ర‌జ‌లు ఘ‌ర్ష‌ణ‌ల‌కు భ‌య‌పడి స‌రిహ‌ద్దులు దాటారు. లాక్ డౌన్ విధించిన 11 జిల్లాల్లో కర్ఫ్యూను గతంలో ఉన్న ఐదు గంటల నుంచి ఆరు గంటలు సడలించినట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో కర్ఫ్యూ సమయాలు మారుతూ ఉంటాయి.