హర్యానాలో మత ఘర్షణ చోటు చేసుకుంది. హిందూ, ముస్లిం వర్గాల సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

హర్యానాలోని నుహ్ జిల్లాలో ఖేరా ఖలీల్‌పూర్ గ్రామంలో మంగళవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లాలోని ఖేడా ఖలీపూర్ గ్రామంలో హిందూ, ముస్లిం సంఘాల సభ్యులు పరస్పరం ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణల సమయంలో కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. ఈ సమయంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో దాదాపు డజను మంది గాయపడినట్లు తెలుస్తోందని ‘టైమ్స్ నౌ’ కథనం నివేదించింది.

నర్సింగ్‌ విద్యార్థినికి మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన స్నేహితులు..

ఈ ఘటన తర్వాత సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్ఎస్ పీ) ఉషా కుందుతో సహా సీనియర్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొనే ఉంది. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బందిని మోహరించారు.

జమ్మూ కాశ్మీర్ రాంబన్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. జమ్మూ - శ్రీనగర్ నేషనల్ హైవేను మూసివేసిన అధికారులు..

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలాల్ అనే 15 ఏళ్ల బాలుడు ఆదివారం ఉదయం తన బంధువును బైక్ పై దింపేసి ఇంటికి తిరిగి వేగంగా వస్తున్నాడు. ఈ సమయంలో ఆ బాలుడు ఓ ఎనిమిదేళ్ల బాలికను ఢీకొట్టాడడని ఆరోపిస్తూ హిందూ వర్గానికి చెందిన కొందరు అతడిపై దాడి చేశారు. దీంతో వివాదం ప్రారంభమైంది. విషయం అక్కడితో సద్దుమణిగినప్పటికీ సోమవారం మళ్లీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. గాలిలో కూడా కాల్పులు జరిగినట్లు నివేదికలు అందాయని పోలీసులు చెప్పారు.

Operation Kanak 2: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అక్ర‌మాలు.. 30 చోట్ల సీబీఐ దాడులు

‘‘రెండు వర్గాల మధ్య రాళ్లదాడి జరిగిన సంఘటన జరిగింది. పోలీసు బలగాలు గ్రామంలో ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉంది. ప్రస్తుతం మేము ఓ వర్గం నుంచి ఫిర్యాదును స్వీకరించాము. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం.’’ అని ఎస్పీ తెలిపారు.