సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకి కేంద్ర ప్రభుత్వం మరో ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే.. చైనాకి సంబంధించిన పలు యాప్ లను భారత్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మరో షాకిచ్చింది. వందే భారత్ రైళ్ల టెండర్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

కొన్ని నెలల క్రితం వందే భారత్ మిషన్ లో భాగంగా  44 సెమీ హైస్పీడ్ రైళ్ల తయారీకి భారత రైల్వే శాఖ టెండర్లకు ఆహ్వానించింది. కాగా.. దానిని  చైనా కి చెందిన సంస్థ దక్కించుకుంది. కాగా.. తాజాగా ఆ టెండర్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వారం రోజుల్లో కొత్తగా టెండర్లకు బిడ్‌ను ఆహ్వానించునున్నట్టు ప్రకటించింది.

ఇక ఈ రైళ్లను ఇండియానే స్వయంగా తయారు చేయనుంది.  క్లాస్ -1,2,నాన్-లోకల్ కేటగీరిని ప్రవేశపెట్టి, దీని ఆధారంగా స్థానికులకు ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాధాన్యత ఇస్తారు. క్లాస్ -1లో స్థానిక సరఫరాదారులు అన్ని ప్రభుత్వ కొనుగోళ్లలో ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే వారి దేశీయ విలువ అదనంగా 50% లేదా అంతకంటే ఎక్కువ. తర్వాతి స్థానంలో క్లాస్ -2 సరఫరాదారులు ఉంటారు. దీని విలువ 20-50 శాతం మధ్య ఉంటుంది.

మరోవైపు, రైల్వే ద్వారా వస్తువులను రవాణా చేయడానికి వ్యాపారులు, సరఫరాదారులు 139కి డయల్ చేయవచ్చని రైల్వే మంత్రి శుక్రవారం ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ హెల్ప్‌లైన్ నంబర్ రైలు ప్రయాణ వివరాలు పొందడానికి ఉపయోగించేవారు.