ఓ వ్యక్తి చిన్న తగదాతో ఇంటి ఓనర్ ను సుత్తితో కొట్టి చంపాడు. ఆ తరువాత ఆ మృతదేహంతో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తాను ఇళ్లు ఖాళీ చేస్తున్నట్టు ఓనర్ కొడుకుకు ఫోన్ చేసి చెప్ప పరారయ్యాడు.
ఢిల్లీ : క్షణికావేశంలో పట్టరాని కోపంతో హత్య చేశాడో వ్యక్తి. ఆ తరువాత ఆ శవంతో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తానెక్కడ పట్టుబడతానో అనే అనుమానంతో మృతుడి కుమారుడికి పదే పదే ఫోన్లు చేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెడితే...ఢిల్లీలోని పంకజ్ అనే వ్యక్తి సురేష్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసై తరచూ తాగి ఇంటికి వస్తుండడంతో యజమాని సురేష్ కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో పంకజ్ ను గట్టిగా చీవాట్లు పెట్టాడు. ఈ సమయంలో సురేష్ కొడుకు జగదీష్ కూడా అక్కడే ఉన్నాడు. తప్పు తనదే కావడంతో పంకజ్ ఇంటి యజమాని సురేష్, అతని కొడుకు జగదీశ్ లకు క్షమాపణలు చెప్పాడు. దీంతో గొడవ అప్పటికి సద్దుమణిగింది.
అయితే పంకజ్.. ఇంటి యజమాని సురేష్ తనను చాలా ఘోరంగా, అవమానకరంగా తిట్టాడని.. అందుకే తాను ఇక ఇంట్లో ఉండలేనని సురేష్ కొడుకు జగదీష్ కి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అయితే జగదీష్ కి పంకజ్ మీద అనుమానం వచ్చింది. వెంటనే తండ్రి ఇంటికి వచ్చి చూశాడు. అక్కడ తండ్రి మృతి చెంది ఉన్నాడు. ఇది గమనించిన జగదీష్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో 250 కిలోమీటర్ల దూరం వెంబడించి మరీ నిందితుడు పంకజ్ ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేశారు.
శ్రీకృష్ణజన్మాష్టమి 2022 : మధుర ఆలయంలో అర్థరాత్రి భక్తుల రద్దీ, ఊపిరాడక ఇద్దరు మృతి
పోలీసుల విచారణలో సురేష్ ను సుత్తితో కొట్టి చంపినట్లు పంకజ్ తెలిపాడు. అంతేకాదు పంకజ్ వెళ్ళిపోతూ సురేష్ మృతదేహంతో ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నట్లు పోలీసులకు వెల్లడించాడు. పంకజ్ వెళ్ళి పోతూ తన వెంట సురేష్ ఐడీ కార్డు, మొబైల్ ఫోను కూడా తీసుకు వెళ్లినట్లు తెలిపారు. అయితే నిందితుడు తన మీద అనుమానం రాకుండా అక్కడ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు జగదీష్ కి వేర్వేరు ప్రదేశాల నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నాడు. ఆ భయమే అతన్ని పోలీసులకు సునాయాసంగా చిక్కేలా చేసింది .
