రాజస్తాన్‌లోని Jhunjhunu districtలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీని జీపు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతిచెందారు. 

రాజస్తాన్‌లోని Jhunjhunu districtలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీని జీపు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. ఝుంఝును- గూడా గాడ్జీ హైవే పై మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులు ఆలయంలో ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. 

‘‘ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని జీపు ఢీకొనడంతో.. అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబంలోని 10 మంది మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు’’ అని ఝుంఝును సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ప్రదీప్ మోహన్ శర్మ తెలిపారు.

ఈ ఘటనపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయాన్ని అధిగమించే శక్తిని వారికి ప్రసాదించాలని, మరణించినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.