బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ ఆలయ పూజారి అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. పదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. స్వీట్లు ఇస్తానని నమ్మించి ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై పూజారి అత్యాచారం చేశాడు. చిక్ బళ్లాపూర్ కు చెందిన వెంకటరమణప్ప (68) ఆలయ పూజారిగా పనిచేస్తుండేవాడు. 

కొద్ది రోజుల క్రితం అతను కూతురు ఇంటికి వచ్చాడు. అల్లుడు పనిమీద వేరే ఊరికి వెళ్లడంతో అతడికి బదులుగా ఆలయ పర్యవేక్,ణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సమయంలో ఆలయం బయట ఆడుకుంటున్న పదేళ్ల బాలికను వెంకటరమణప్ప చూశాడు. 

అతను బాలిక వద్దకు వెళ్లి ఇంట్లోకి వస్తే స్వీట్లు ఇస్తానని ఆశపెట్టాడు. తన కూతురు ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆడుకోవడానికి బయటకు వెళ్లి చిన్నారి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆ ప్రాంతంలో గాలించారు. 

ఆలయం బయట పూలు అమ్ముకునే వ్యక్తి బాలిక పూజారితో పాటు వాళ్లింటికి వెళ్లడం చూశానని తల్లిదండ్రులకు చెప్పాడు. అక్కడికి వెళ్లి చూసిన తల్లిదండ్రులకు గుక్క పట్టి ఏడుస్తున్న బాలిక కనిపించింది. 

తల్లి అడగడంతో జరిగిన విషయాన్ని బాలిక చెపపింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. బాలిక పూజారితో బాలిక వెళ్లిన దృశ్యాలు కనపించాయి. దాంతో పూలకొట్టు వ్యక్తి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు వెంకటరమణప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు.