కర్ణాటక రాష్ట్రం బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మనేక్కెల్లి నిర్నా క్రాస్ రోడ్డు వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కళ్యాణి అనే మహిళ సజీవదహనమయ్యారు.

ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం నుంచి ఆమె భర్త, ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. వ్యాపారం నిమిత్తం కళ్యాణి కుటుంబం నాసిక్ లో స్థిరపడింది. వారంతా కారులో నాసిక్ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కారులోని కళ్యాణి మిగిలిన కుటుంబసభ్యులంతా క్షేమంగా బయటపడ్డారు. వారికి స్వల్పగాయాలయ్యాయి.