చెన్నైలో అగ్నిప్రమాదం.. తెలంగాణ యువకుడు మృతి

Telangana man charred to death in apartment in Chennai
Highlights

కాల్చి పారేసిన సిగరెటే ఈ ప్రమాదానికి కారణమా?

చెన్నైలోని ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ తెలంగాణ యువకుడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాద సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..భరద్వాజ(25) తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ నుంచి చెన్నై నగరానికి చేరుకున్నాడు.

చెన్నైలోని లిటిల్ మౌంట్ సమీపంలోని ఓ సర్వీస్ అపార్ట్ మెంట్ లో అతను నివాసం ఉంటున్నాడు. కాగా.. ఆదివారం తెల్లవారుజామున అనుకోకుండా అతను ఉన్న అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.దీంతో భరద్వాజ కాలి బూడిదయ్యాడు. అయితే.. ఈ ప్రమాదం సిగరెట్ కారణంగా జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

భరద్వాజ జర్మనీ లో ఉద్యోగం చేస్తున్నాడని.. కొంతకాలం క్రితమే ఇండియాకి వచ్చినట్లు తెలుస్తోంది.  తన తండ్రి చిరంజీవి బిజినెస్ వ్యవహారాలను చక్కబెట్టేందుకు చెన్నై రాగా ఈ ప్రమాదం చేసుకున్నట్లు సమాచారం. ప్రమాదం సమయంలో భరద్వాజ ఆల్కహాల్ సేవించి ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సిగరెట్ కాల్చి.. దానిని ఆర్పకుండా పడేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వారు భావిస్తున్నారు. 

loader