Telangana paraglider Dies in sikkim: సరదాగా పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్లిన తెలంగాణ యువ‌తికి ఊహించని ఘటన ఎదురైంది. బలమైన గాలులు ఎదురు రావడంతో వారు బ్యాలెన్స్ కోల్పోయి.. అక్కడే ఉన్న నదిలో పడిపోయారు. ప్ర‌వాహ ఉధృతి వేగంగా ఉండ‌టం వ‌ల్ల నీట మునిగి ప్రాణాలు కొల్పోయింది. ఈ ఘ‌ట‌న సిక్కింలోని చోటుచేసుకుంది.  

Telangana paraglider Dies in sikkim: ప్ర‌స్తుతం యువ‌త‌ అడ్వెంచర్ టూరిజంపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది. ఎక్కువ‌ రివర్ రాఫ్టింగ్, కేవింగ్, డైవింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, విండ్ సర్ఫింగ్, జిప్​లైన్​ ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, తదితర సహ‌సోపేత‌మైన క్రీడలపై యువత ఆస‌క్తిని కనబరుస్తోంది. వీటి కోసం ఉరుకలు వేస్తూ పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే, ఈ ఇలాంటి క్రీడ‌ల్లో పాల్గొనేట‌ప్ప‌డూ త‌గిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేనిచో అనుకోని ప్ర‌మాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది. తాజాగా ఓ యువ‌తి సరదాగా చేసిన పారాగ్లైడింగ్ లో పెను విషాదం మిగిల్చింది. ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

పూర్తి వివరాలు.. తెలంగాణలోని ఖమ్మంకు చెందిన ఈషారెడ్డి (23), విహార యాత్రల కోసం సిక్కింకు వెళ్లింది. అక్కడ కొన్ని రోజుల పాటు సంతోషంగా గ‌డిపి.. రావాల‌నుకుంది. ఈ క్రమంలో ఆమె.. పారాగ్లైడింగ్ చేయాలనుకుంది. ఈ క్ర‌మంలోనే గ్యాంగ్ టక్ లోని థమీ దారా ప్రాంతానికి చెందిన సందీప్ గురుంగ్ (26) అనే పారాగ్లైడింగ్ గైడ్ ను క‌లిసింది. వీరిద్ద‌రూ క‌లిసి శుక్రవారం.. రోజున కొండ దగ్గరకు వెళ్లి అక్కడ ప్రత్యేక మైన దుస్తులు ధరించి పారాగ్లైడింగ్ కు వెళ్లారు.

అయితే.. వీరిద్ద‌రూ పారాగ్లైడింగ్ చేసే క్ర‌మంలో బలమైన గాలులు వీయ‌డంతో వారు తమ బ్యాలెన్స్ ను కోల్పోయి.. అక్కడ ప్రవహిస్తున్న లంచుంగ్ నదిలో పడి మరణించారు. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, ITBP ,సైన్యం పాల్గొన్న సెర్చ్ ఆపరేషన్ తర్వాత సాయంత్రం వారి మృతదేహాలను పోలీసులు, ఐటీబీపీ పోలీసులు రంగంలోనికి దిగారు. వారు గజఈత గాళ్లతో కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.


ఈషా రెడ్డి తన గైడ్ సందీప్ గురుంగ్ (26)తో కలిసి గ్యాంగ్‌టక్‌లోని లాచుంగ్ వ్యూ పాయింట్ వెళ్లారు. అక్క‌డ నుంచిఉదయం 9.30 గంటలకు క్లైడింగ్ బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. బలమైన గాలుల కారణంగా అవి బ్యాలెన్స్ కోల్పోయాయి, లాచుంగ్ నదిలో పడిపోయార‌నీ, ఈ న‌దిబలమైన ప్రవాహాలకు కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు. పోలీసులు, ITBP ,సైన్యం సెర్చ్ ఆపరేషన్ తర్వాత సాయంత్రం వారి మృతదేహాలను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు.

మృతదేహాలను వెలికి తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, అయితే నది ప్రవాహాల కారణంగా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. కొన్ని గంటల పాటు వెతికిన తర్వాత.. వారి మృత దేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ కూతురు చనిపోయిందనే వార్త తెలియగానే కుటుంబమంతా తీరని విషాదంలో మునిగిపోయారు.