ఆరు దశాబ్దాల పోరాటం.. తెలంగాణ ఆవిష్కరణలు, స్టార్టప్‌ల కేంద్రంగా ఎదుగుతోంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Telangana Formation Day: ఆరు దశాబ్దాలకు పైగా సాగిన రాష్ట్ర సాధన పోరాటంలో చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకుంటూ నేడు తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవాలను జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే భారత ప్రథమ పౌరులు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ సహా ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Telangana day: ఆరు దశాబ్దాలకు పైగా సాగిన రాష్ట్ర సాధన పోరాటంలో చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకుంటూ నేడు తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవాలను జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే భారత ప్రథమ పౌరులు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ సహా ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర అవరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు.నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తోందని ప్రశంసించారు. 2014లో ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ''తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అడవులు, వన్యప్రాణులతో నిండిన తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వం, ప్రతిభావంతులైన వ్యక్తులతో ప్రత్యేకంగా ఆశీర్వదించబడిందని" రాష్ట్రపతి పేర్కొన్నారు.
'ఈ అందమైన రాష్ట్రం ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్కు కేంద్రంగా ఎదుగుతోంది. తెలంగాణ నిరంతరం అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను' అని ముర్ము ట్వీట్ చేశారు. “ఈ అందమైన రాష్ట్రం ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ రాష్ట్రం నిరంతరం అభివృద్ధి చెందాలనీ, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. నా శుభాకాంక్షలు" అని ముర్ము ట్వీట్ చేశారు.
తెలంగాణ పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మూడు వారాల పాటు జరిగే ఈ వేడుకలను శుక్రవారం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ భవనంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన రాష్ట్ర సాధన పోరాటంలో చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి చివరి దశ ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపించిన తీరును ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర లక్ష్యసాధనలో ఎదుర్కొన్న కష్టనష్టాలను, అవమానాలను వివరిస్తూ, ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం చివరకు కేంద్రం తలవంచేలా చేసిందని కొనియాడారు.
2014 జూన్ 2న తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాష్ట్రం అన్ని రంగాల్లో అసాధారణ విజయాలు సాధించడం హర్షణీయమన్నారు. అన్ని అడ్డంకులను ఎదుర్కొని ప్రత్యర్థులపై నిలబడింది. అన్ని ఆటుపోట్లను అధిగమించి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపిస్తోంది. పరిపాలన, అభివృద్ధిలో 'తెలంగాణ మోడల్' దేశ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందింది. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తరహా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.