తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ముందస్తు ఎన్నికలు ఎప్పుడనే వార్తలకు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. ఈ ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ: తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ముందస్తు ఎన్నికలు ఎప్పుడనే వార్తలకు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. ఈ ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఓ సీనియర్ అధికారి న్యూస్ ఏజెన్సీకి సూచన ప్రాయంగా తెలిపినట్లు సమాచారం.
డిసెంబర్ రెండో వారం కల్లా ఐదు రాష్ట్రాల ఎన్నికల పక్రియ పూర్తవుతుందని ఆ అధికారి వెల్లడించారు. గతంలోని ఎన్నికల షెడ్యూళ్లను చూసుకుంటే చత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లోనూ, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పక్రియను వేగవంతం చేసిన ఎన్నికల సంఘం అక్టోబర్ 8 కల్లా ఓటరు జాబితా తుది ముసాయిదాను ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
Last Updated 19, Sep 2018, 9:24 AM IST