Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో పరాభవం: రాహుల్ వ్యూహం మారుతుందా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళి రాబోయే సాధారణ ఎన్నికల్లో పార్టీలు ఎంచుకునే వ్యూహాలను సూచిన్నట్టుగా భావించవచ్చు. ఐదు రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో మినహా మిగతా రాష్ట్రాల్లో  కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగింది.

Telangana defeat: Congress lone contest helped
Author
New Delhi, First Published Dec 11, 2018, 1:35 PM IST

న్యూఢిల్లీ: ప్రస్తుతం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త కోణాన్ని వెల్లడిస్తున్నాయి. కాంగ్రెసు ఒంటరిగా పోటీ చేసిన రాష్ట్రాల్లో మంచి ఫలితాలను సాధించింది. పొత్తు పెట్టుకుని పోటీ చేసిన తెలంగాణలో పరాభవం ఎదురైంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళి రాబోయే సాధారణ ఎన్నికల్లో పార్టీలు ఎంచుకునే వ్యూహాలను సూచిన్నట్టుగా భావించవచ్చు. ఐదు రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో మినహా మిగతా రాష్ట్రాల్లో  కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగింది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన గత ఎన్నికలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఉత్తర ప్రదేశ్ లో గతంలో కాంగ్రెస్ వివిధ పార్టీలతో కలిసి ఒక కూటమిగా కలిసి ఎన్నికల బరిలో నిలిచింది. కానీ ప్రజలు అత్యంత ఘోరంగా తిరస్కరించారు. 

అదే వేరే రాష్ట్రాలలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు బ్రహ్మ రథం పట్టారు. ఇలా చూసినప్పుడు కాంగ్రెస్ ఒంటరి పోరే కాంగ్రెస్ పార్టీకి లాభించిందని చెప్పవచ్చు.

 ఇప్పుడు జరిగిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అర్ధమవుతోంది. 

రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో ఓటరు పోరే కాంగ్రెస్ ని గట్టెక్కించే సూచనలు కనిపిస్తున్నాయి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి టిడిపి, సిపిఐ, టిజేఎస్ లతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ చతికిలపడింది. కాంగ్రెస్ కి ఒంటరి పోరే కలిసి వస్తుందని దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఉన్న జనాదరాణ టీడీపీ, ఇతర పార్టీలతో కలిసి బరిలోకి దిగేటప్పటికీతుడిచిపెట్టుకుపోయిందని తేలింది. దీన్ని కాంగ్రెస్ తన స్వయంకృపతారాధంగానే పరిగణించాలి. కాంగ్రెస్ ఒంటరిగా వెళ్లి ప్రజల్లో ఎంతో సానుకూలత వచ్చే అవకాశం ఉన్నా కూడా వివిధ పార్టీలతో కలిసి వెళ్లి అధికార పార్టీ టిఆర్ఎస్ నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. ఈ స్థితిలో రాహుల్ గాంధీ వ్యూహం మారుతుందా అనేది చూడాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios