ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రామేశ్వరంలోని ప్రఖ్యాత రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం కుటుంబసభ్యులతో కలిసి రామలింగేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన ముఖ్యమంత్రికి... ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారి దర్శనం చేయించి.. తీర్ధప్రసాదాలు అందజేశారు. రామేశ్వరానికి సమీపంలోనే ఉన్న ధనుష్కోటీ, రామసేతు, పంచముఖ హనుమాన్ దేవాలయాలను సీఎం ఫ్యామిలీ దర్శించుకుంది.

కేసీఆర్ వెంట ఆయన భార్య శోభ, కుమారుడు కేటీఆర్ దంపతులు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి తమిళనాడు పర్యటనను ముగించుకుని గురువారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు.