Asianet News TeluguAsianet News Telugu

బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యశ్వంత్ సిన్హా.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్..

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌ చేరుకున్నారు. విపక్షాల అభ్యర్థిగా ఆయన నేడు తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు.  బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు.

Telangana CM KCR Received yashwant sinha at begumpet airport take part in rally
Author
First Published Jul 2, 2022, 11:56 AM IST

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌ చేరుకున్నారు. విపక్షాల అభ్యర్థిగా ఆయన నేడు తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు.  బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. యశ్వంత్ సిన్హాకు కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు ఉన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి యశ్వంత్ సిన్హా ర్యాలీగా నెక్లెస్ రోడ్డులో జలవిహార్‌కు చేరుకోనున్నారు. 

ఈ బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జలవిహార్‌లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించనున్నది. ఈ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిచనున్నారు. యశ్వంత్ సిన్హాకు మద్దతుపై పార్టీ శాసనసభ్యులు, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత తనకు మద్దతివ్వాలని కోరుతూ యశ్వంత్ సిన్హా ప్రసంగించనున్నారు. అక్కడ సభ ముగిసిన తర్వాత కేసీఆర్, టీఆర్ఎస్ నేతలతో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు. యశ్వంత్ సిన్హా ర్యాలీ, సభకు సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు. 

 

ఇక, ఇటీవల ఢిల్లీలో యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో టీఆర్ఎస్ తరఫున మంత్రి కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పలువురు టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా తాము యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తున్నట్టుగా కేటీఆర్ ప్రకటించారు. 

ఇక, మరోవైపు నేడు హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్‌కు వస్తున్నారు. దీంతో ఈ పరిణమాలు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఓవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సాగుతుండగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా బల ప్రదర్శన చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios