బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని, మహాత్మాగాంధీ దేశంగా ఉన్న భారత్‌ను గాడ్సే దేశంగా మార్చాలని అనుకొంటున్నదని మండిపడ్డారు.
బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై తేజస్వి యాదవ్ శుక్రవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీబీసీ కార్యాలయంలో జరిగిన ఐటీ సర్వేపై తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని, అధికార బీజేపీ భారత్‌ను నాథూరాం గాడ్సే దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ఇలా చేయడం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కఠినంగా వ్యవహరిస్తారనే సందేశాన్ని కేంద్రం పంపాలని చూస్తోందని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. బీబీసీలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసునని అన్నారు. గుజరాత్‌లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేననీ, మహాత్మా గాంధీ దేశాన్ని నాథూరాం గాడ్సే దేశంగా మార్చాలని భావిస్తోన్నారని ఆరోపించారు. వారు హిందూ దేశం గురించి మాట్లాడతారు. కానీ, భారత దేశానికి వైవిధ్యమే అందమని అన్నారు.
అంతకుముందు, JDU నాయకుడు సునీల్ సింగ్ మాట్లాడుతూ.. BBC కార్యాలయాల్లో సుమారు 60 గంటల పాటు కొనసాగిన ఆదాయపు పన్ను సర్వేకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని , ఈ చర్య ప్రతీకార రాజకీయాలలో భాగమని అన్నారు. రాజకీయ ప్రతీకారం కోసం ఆదాయపు పన్ను, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీబీసీపై ఐటీ దాడులు తెలియజేస్తోందని ఆయన అన్నారు. సునీల్ సింగ్ ఇంకా మాట్లాడుతూ.. 'బీబీసీ ఒక ప్రెస్, ప్రెస్ ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం. ఈ ఆపరేషన్ ప్రజాస్వామ్యంపై దాడి అని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
అంతకుముందు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. దేశంలో అన్ని మతాలు, వర్గాల ప్రజలు నివసిస్తున్నారని అన్నారు. ఎవరైనా భారతదేశాన్ని 'హిందూ దేశం'గా మార్చాలనుకుంటే, ఆ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. భారతదేశంలో ఇది సాధ్యమా? అని ప్రశ్నించారు.
ఎవరైనా రివర్స్‌లో మాట్లాడాలనుకుంటే దేశాన్ని నాశనం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇలా మాట్లాడే వారికి ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఎవరైనా ఏదేదో చెబుతారు, కానీ జాతిపిత మహాత్మా గాంధీ తప్ప ఎవరి మాట వినరు. బాపు దేశానికి చాలా చెప్పారు. దేశం గురించి బాపు చెప్పిన మాటలను గమనించాలి. ఆయన మాటలను తీసుకెళ్తూ పనిని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.
తమను తాము 'భారతవర్ష్' కుమారులు, కుమార్తెలుగా చెప్పుకునే 1.3 బిలియన్ల ప్రజలందరికీ హిందూత్వ పదం వర్తిస్తుందని RSS విశ్వసిస్తుందని భగవత్ చాలాసార్లు చెప్పారు. "హిందూ అనేది ఏదో ఒక శాఖ లేదా తెగ పేరు కాదు, ఇది ప్రాంతీయ భావన కాదు, ఇది ఒకే కులాల వంశం లేదా నిర్దిష్ట భాష మాట్లాడేవారి ప్రత్యేక హక్కు కాదు. ఈ పదాన్ని అంగీకరించడంలో అభ్యంతరం ఉన్నవారు ఉండవచ్చు. ”అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
