ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో తాంత్రికుడి చికిత్స కారణంగా ఓ చిన్నారి మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఏడాదిన్నర చిన్నారి దారుణ హత్యకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో వెలుగుచూసింది. ఖుర్జా నగర్ కొత్వాలి ప్రాంతంలోని ధంకర్ గ్రామానికి సంబంధించినది. ఇక్కడ ఒక తాంత్రికుడు చికిత్స సమయంలో విషపు గుళికలు ఇచ్చి..చిన్నారిని చంపాడని తల్లిదండ్రలు ఆరోపిస్తోన్నారు. మరోవైపు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తాంత్రికుడిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది?
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ జిల్లాలోని ధకర్ గ్రామంలో అనూజ్ అనే ఏడాదిన్నర చిన్నారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దాంతో కుటుంబసభ్యులు అతడిని స్థానికంగా ఉన్న ఓ మంత్రగాడి ఇంటికి దగ్గరికి తీసుకెళ్లారు. బాలుడిని బాగుచేసే పేరుతో ఆ మంత్రగాడు విక్రుత చేష్టాలు చేశారు. ఆ చిన్నారిని నేలకేసి కొట్టాడు. అంతేగాక, ఆ బాలుడి నోట్లోని పళ్లను విరగ్గొట్టాడు. దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. అనంతరం చిన్నారి పరిస్థితి విషమించడంతో తాంత్రిక్ అజయ్ చిన్నారిని తల్లితో పాటు పారిపోయేలా చేశాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది.
పరిశీలించిన వైద్యులు ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. దాంతో బాధిత కుటుంబం బాలుడి భౌతికకాయాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. చిన్నారి మృతిలో తాంత్రికుడి హస్తం ఉందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తాంత్రికుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు తాంత్రికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరో ఉదంతం వెలుగులోకి..
మెయిన్‌పురి జిల్లాలో మరో కేసు తెరపైకి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో 9 మంది చిన్నారులు నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో అధికారులు నీటి నమూనాను విచారణ కోసం పంపించారు.
