ప్రాణాంతక ఆన్‌లైన్ వీడియో గేమ్ ‘‘బ్లూవేల్’’ భూతానికి మరో ప్రాణం బలైంది. కర్ణాటకలోని కలబురిగిలో ఏడో తరగతి చదువుతున్న సమర్థ్ అనే 12 ఏళ్ల చిన్నారి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ప్రాణాంతక ఆన్‌లైన్ వీడియో గేమ్ ‘‘బ్లూవేల్’’ భూతానికి మరో ప్రాణం బలైంది. కర్ణాటకలోని కలబురిగిలో ఏడో తరగతి చదువుతున్న సమర్థ్ అనే 12 ఏళ్ల చిన్నారి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బాలుడు గత కొన్నేళ్లుగా మొబైల్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాడని... దీనిలో భాగంగా అత్యంత ప్రమాదకరమైన ఆన్‌లైన్ వీడియో గేమ్ బ్లూవేల్ మాయలోపడి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

వారం రోజులుగా మౌనంగా ఉండటం... ఎవ్వరితోనూ కలవడం లేదని.. కొద్దిరోజుల కిందటే తనకు ఓ ఇనుప స్టాండ్ కొనివ్వాలని మారాం చేయడంతో తల్లిదండ్రులు కొనిచ్చారు. అది ఎందుకు అని అడిగితే పాఠాలకు సంబంధించిన ప్రయోగం కోసమని చెప్పాడు.

సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తల్లిని తనకు పానీపూరి కావాలని కోరాడు. ఇందుకోసం ఆమె బయటకు వెళ్లి వచ్చేలోపు.. ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు బ్లూవేల్ గేమ్ ఉచ్చులో చిక్కుకుని తనువు చాలించినట్లు సమర్థ్ తండ్రి సూరజ్ కన్నీటిపర్యంతమవుతున్నారు.