Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలిక రెండో పెళ్లి : రక్షణ కావాలంటూ కోర్టులో పిటిషన్... జడ్జ్ ఏమన్నారంటే...

ఓ మైనర్ పెళ్లి చేసుకోవడమే కాకుండా.. తనకు రక్షణ కల్పించమంటూ కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు ఇది తనకు రెండో పెళ్లి అని కూడా పిటిషన్ లో పేర్కొనడంతో కోర్టు షాక్ కు గురైంది. నిజానికి మైనర్ల పెళ్లి చట్ట విరుద్ధం, చెల్లదు కూడా. 

teenage girl marries a second maariage, punjab, haryana HC terms it void, sends her to care home - bsb
Author
Hyderabad, First Published Jun 5, 2021, 3:19 PM IST

ఓ మైనర్ పెళ్లి చేసుకోవడమే కాకుండా.. తనకు రక్షణ కల్పించమంటూ కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు ఇది తనకు రెండో పెళ్లి అని కూడా పిటిషన్ లో పేర్కొనడంతో కోర్టు షాక్ కు గురైంది. నిజానికి మైనర్ల పెళ్లి చట్ట విరుద్ధం, చెల్లదు కూడా. 

అలాంటిది ఓ మైనర్ బాలిక వివాహం చేసుకోవడమే కాకుండా తనకు రక్షణ కావాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివరాల్లోకి వెడితే... పదహారేళ్ల ఓ బాలిక తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందున ఆమెకు వారి నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. బాలిక ఇంకా మైనర్ కాగా తనకు ఇది రెండో వివాహమని పిటిషన్ లో పేర్కోవడం గమనార్హం. అయితే బాలిక పిటిషన్ ను స్వీకరించిన పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. 

విచారణలో జస్టిస్ సుధీర్ మిట్టల్ ధర్మాసనం ఈ అంశంమీద కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మైనార్టీ తీరకుండానే పెళ్లి చేసుకోవడం చట్టవిరుద్ధం, కాగా బాల్యవివాహాల నిషేధ చట్టం, 2006 లోని సెక్షన్ 12 కింద ఈ వివాహం చెల్లదు. ఇదీ గాక సదరు బాలిక తనకిది రెండో పెళ్లి అని పిటిషన్ లో పేర్కోవడం మీద విచారణ జరపాలని తెలపుతూ తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. 

వెంకయ్య నాయుడి హ్యాండిల్ కి వెరిఫైడ్ బ్లూ బ్యాడ్జిని తిరిగి ఇచ్చిన ట్విట్టర్...

అప్పటి వరకు ఆ బాలికకు, వివాహం చేసుకున్న యువకుడికి ప్రభుత్వం రక్షణ కల్పించాలంటూ స్పష్టం చేసింది. బాలిక నివాసానికి దగ్గర్లో ఉండే నారినికేతన్ లో ఉంచి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే క్రమంలో ప్రభుత్వం పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలి. 

ఇరువురి తల్లిదండ్రులు, బంధువులను పిలిపించి వారి సమక్షంలోనే సదరు బాలికకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. కౌన్సెలింగ్ తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నివేదిక రూపంలో జూలై 23 లేదా అంతకంటే ముందే హైకోర్టుకు అందజేయాలి’ అని ధర్మాసనం తీర్పునిచ్చింది. మైనార్టీ తీరకుండానే రెండు సార్లు వివాహం చేసుకున్న సదరు బాలిక పిటిషన్ మీద హైకోర్టు తుది తీర్పు మీద ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios