రాజస్తాన్‌లో ఓ టీనేజీ బాలుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మరో వ్యక్తితో పెళ్లి చేసుకుందని, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వివరించారు. 

జైపూర్: రాజస్తాన్‌లో ఒక టీనేజీ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని ఆ బాలుడు తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. భిల్వారా జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మహాత్మా గాంధీ హాస్పిటల్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అటు వైపుగా వెళ్లిన కొందరు అతడిని యశ్ వ్యాస్‌గా గుర్తించారు. అనంతరం, అతడిని హాస్పిటల్‌లోకి తీసుకెళ్లినట్టు భిల్వారా సర్కిల్ ఆఫీసర్ నరేంద్ర దేమా వివరించారు.

అనంతరం, అతడిని ట్రీట్‌మెంట్ కోసం ఉదయ్‌పూర్‌కు రిఫర్ చేశారని ఆయన తెలిపారు. అక్కడే గాయాలతో శుక్రవారం ఉదయం మరణించినట్టు వివరించారు.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, వ్యాస్, ఆ అమ్మాయి ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ బాలుడు సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టాడు. తన గర్ల్‌ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నదని, దానితో తాను అప్‌సెట్ అయినట్టు ఆ స్టేటస్‌లో పేర్కొన్నాడు.

Also Read: అంత్యక్రియలకు ఎమ్మెల్యే హాజరుకావాలంటూ లేఖ రాసి కార్మికుడు సూసైడ్.. ఎక్కడంటే ?

ఆయన డెడ్ బాడీని పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అందించినట్టు అధికారులు వివరించారు.