ముంబై:  సాహసం చేసే పేరుతో ఓ యువకుడు 18 అంతస్తలు భవనంపై నుండి కిందపడి మృతి చెందాడు.  సెంట్రల్ చైనాలోని హెనాన్ ఫ్రావిన్స్‌లోని క్విన్ యాంగ్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది.

19 ఏళ్ల యాంగ్ అనే యువకుడు 18 అంతస్తుల భవనం చివర  చిన్న గోడపై నిలబడి సాహసం చేసేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు మరణించాడు. అదే సమయంలో  ఎదురుగా  ఉన్న భవనం నుంచి ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

సెల్ఫీ పిచ్చితోనో లేక సాహసాల పేరుతోనో ప్రాణాలు కోల్పోవొద్దని సందేశమిస్తూ ఏప్రిల్‌ 22న జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోను ముంబై పోలీసులు ట్వీట్‌ చేశారు. దీంతో ఈవీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.