జేపీ నడ్డా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ సమయంలో ఈ సమస్య ఎదురైంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ సమయంలో ఈ సమస్య ఎదురైంది. దీంతో జేపీ నడ్డా ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానాన్ని కర్ణాటకలోని విద్యానగర్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. దీంతో ఆయన అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఆయన కరీంనగర్‌కు బయలుదేరుతారు.
షెడ్యూల్ ప్రకారం.. జేపీ నడ్డా ఈరోజు కర్ణాటక, తెలంగాణలలో పర్యటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్ణాటకకు చేరుకున్నారు. అక్కడ పలు కార్యక్రమాలకు హాజరైన జేపీ నడ్డా.. అనంతరం కర్ణాటక నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తెలంగాణలో పర్యటన ఆలస్యం కానుంది.