Asianet News TeluguAsianet News Telugu

ఐటీ ఉద్యోగినిపై 43 మంది సహచరుల లైంగిక వేధింపులు,కంపనీ బాస్‌ కూడా...

దేశ రాజధాని డిల్లీలో మహిళలపై లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడి మహిళలకు రోడ్లపైనే కాదు ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఓ ఐటీ ఉద్యోగిణిపై సహచరులే లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన నోయిడా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇలా తాను పనిచేసే ఆఫీసులోని 43 మంది ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు యువతి ఏకంగా ఇద్దరు సీఎంలతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
techie alleges sexual harassment by 43 colleagues in Noida
Author
Noida, First Published Aug 14, 2018, 12:14 PM IST

దేశ రాజధాని డిల్లీలో మహిళలపై లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడి మహిళలకు రోడ్లపైనే కాదు ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఓ ఐటీ ఉద్యోగిణిపై సహచరులే లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన నోయిడా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇలా తాను పనిచేసే ఆఫీసులోని 43 మంది ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు యువతి ఏకంగా ఇద్దరు సీఎంలతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గజియాబాద్ కు చెందిన ఓ 20ఏళ్ల యువతి నోయిడా ప్రాంతంలోని ఓ ఐటీ కంపనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమె ఉద్యోగంలో చేరిన 2017 నవంబర్ నుండి తోటి ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామంటే ఈ వేధింపులకు పాల్పడుతున్న వారిలో ఆ కంపనీ బాస్ కూడా ఉన్నారు. దీంతో ఆమె వారి వేధింపులను భరిస్తూ వచ్చింది.

అయితే ఈ మధ్య కాలంలో వారి ఆకృత్యాలు శృతిమించాయి. యువతికి వాట్సాప్ లో అసభ్యకర వీడియోలు, ఫోటోలు పంపిస్తూ తీవ్ర మనోవేధనకు గురిచేయడం ప్రారంభించారు. తమ లైంగిక వాంచ తీర్చాలంటూ ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దీంతో సదరు మహిళ వీరి వేధింపులను భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

తనపై జరుగుతున్న వేధింపులను వివరిస్తూ యూపీ సీఎం మోగి ఆదిత్యనాథ్, మహిళా కమీషన్ తో పాటు డిల్లీ సీఎం కేజ్రీవాల్ బాదిత మహిళ పిర్యాదు చేసింది. ఇప్పటికే వేధింపులకు పాల్పడిన 43 మందిలోని 21 మంది ఉద్యోగులను గుర్తించిన పోలీసులు వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. మిగతా 23 మంది పేర్లను గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొన్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరిపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios