ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ బాలుడిని, ఇతర బాలుడితో ఓ టీచర్ కొట్టించారు. యూపీలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖండించారు.
మైనారిటీ వర్గానికి చెందిన బాలుడిని చెంపదెబ్బ కొట్టాలని ఓ స్కూల్ టీచర్ తన విద్యార్థులకు సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. యూపీలో జరిగిన ఈ ఘటనను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖండించారు.
యూపీలోని మన్సూర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుబ్బాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇది చోటు చేసుకుంది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని కొట్టాలని ట్రాప్టి త్యాగి అనే ఉపాధ్యాయుడు కోరాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై పోలీసులు స్పందించారు. సర్కిల్ ఆఫీసర్ రవిశంకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైరల్ వీడియోను పరిశీలించామని, పాఠశాల పని పూర్తి చేయనందుకే బాలుడిని కొట్టినట్టుగా తెలుస్తోందని చెప్పారు. ఈ వీడియోలో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.
కాగా.. ఈ వీడియోలో విద్యార్థులతో పాటు ఇద్దరు వ్యక్తులు కూడా వీడియోలో కనిపిస్తున్నారని, వారిలో ఒకరు టీచర్ అని, మరొకరి ఎవరనేది తెలియడం లేదని తెలిపారు. అతడిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రాథమిక శిక్ష అధికారి శుభమ్ శుక్లా తెలిపారు. ఇద్దరిపైనా, పాఠశాల యాజమాన్యంపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత బాలుడిది, అతడిని కొట్టిన వారి మతం గురించి మీడియా అడిగినప్పుడు.. ఇంకా ఈ విషయంలో దర్యాప్తు జరుగుతోందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపారు. తమ బృందం దీనిపై దర్యాప్తు చేస్తుందని, పోలీసులు కూడా ఈ కేసును పరిగణనలోకి తీసుకున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు.అమాయక పిల్లల మనస్సుల్లో వివక్ష అనే విషాన్ని నాటడం, పాఠశాల వంటి పవిత్ర స్థలాన్ని విద్వేషాల మార్కెట్ ప్రదేశంగా మార్చిన ఉపాధ్యాయుడు.. ఇంత కంటే దేశానికి పెద్ద చేసిన ఘోరం మరొకటి లేదని అన్నారు. ఇదే కిరోసిన్ ను బీజేపీ వెదజల్లుతోందని, ఇది భారతదేశంలోని ప్రతి మూలకు నిప్పు పెట్టిందన్నారు. ‘‘పిల్లలే భారతదేశానికి భవిష్యత్తు - వారిని ద్వేషించకండి, మనమందరం కలిసి ప్రేమను బోధించాలి’’ అని తెలిపారు. చంద్రుడిపైకి వెళ్లడానికి సాంకేతిక పరిజ్ఞానం లేదా విద్వేషపు సరిహద్దు గోడను నిర్మించే విషయాల గురించి ఎక్కడ చర్చ జరుగుతోందని ప్రియాంక గాంధీ అన్నారు. ‘‘ఎంపిక స్పష్టంగా ఉంది. ప్రగతికి ద్వేషం అతిపెద్ద శత్రువు’’ అని తెలిపారు.
