విద్యార్థిణిపై ఓ టీచర్ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడటమే కాదు గర్భందాల్చగా బలవంతంగా అబార్షన్ చేయించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
లక్నో: విద్యాబుద్దులు నేర్పాల్సిన వాడే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మాయమాటలతో విద్యార్థిణిని లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడటమే కాదు గర్భందాల్చిన యువతికి అబార్షన్ కూడా చేయించాడు మదర్సాలో పనిచేసే ఉపాధ్యాయుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాకల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి జిల్లాలో ఫీష్ గడ్ ప్రాంతానికి చెందిన యువతి మతపరమైన విద్యాసంస్థ అయిన మదర్సాలో చదువకునేది. అయితే అదే మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఒకడు ఆ యువతిపై కన్నేసాడు. విద్యాబుద్దులు నేర్పాల్సిన వాడే ప్రేమిస్తున్నానంటూ సదరు యువతి వెంటపడ్డాడు. అతడి మాయమాటలను నమ్మిన యువతి ప్రేమను అంగీకరించింది.
కొంతకాలం ప్రేమికుడిగానే వున్న టీచర్ పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. దీంతో అతడితో శారీరకంగా కలవడానికి యువతి అంగీకరించింది. ఇలా పలుమార్లు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. ఇలా నాలుగేళ్లుగా యువతిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు.
read more రాజస్థాన్‌లో దారుణం: వివాహితతో సంబంధం, వ్యక్తిని కొట్టి చంపారు
ఇటీవల యువతి గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు. అయితే తామిద్దరం ప్రేమించుకున్నాం కదా ఇక పెళ్లి చేసుకుందామని యువతి సదరు టీచర్ ను కోరింది. దీంతో అతడు తన అసలు రూపాన్ని బయటపెడ్డాడు. మరోసారి పెళ్లి మాట ఎత్తితే చంపేస్తానని బెదిరించాడు. తాను మోసపోయానని గుర్తించిన బాదిత బాలిక పోలీసులను ఆశ్రయించింది.
యువతిని నమ్మించి అత్యాచారం చేయడమే కాకుండా బలవంతంగా అబార్షన్ చేయించిన కీచక ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని... నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు.
