Punjab's Phagwara: తరగతి గదిలోని ఎల్ సీడీ స్క్రీన్ పై అశ్లీల వీడియోను చూపించాడు ఓ కీచ‌క టీచ‌ర్. ఇదే స‌మ‌యంలో ఆరో తరగతి విద్యార్థినులకు అసభ్యకరమైన సైగ‌లు చేశాడు. స‌ద‌రు ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

Teacher arrested for showing obscene videos to students: విద్యార్థుల‌కు విద్యాబుద్దులు నేర్పించే ఉపాధ్యాయ వృత్తికి కొంద‌రు మ‌చ్చ తెస్తున్నారు. విద్యార్థుల‌తో న‌డుచుకోరాని విధమైన దారుణ ప‌నులు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తరగతి గదిలోని ఎల్ సీడీ స్క్రీన్ పై అశ్లీల వీడియోను చూపించాడు ఓ కీచ‌క టీచ‌ర్. ఇదే స‌మ‌యంలో ఆరో తరగతి విద్యార్థినులకు అసభ్యకరమైన సైగ‌లు చేశాడు. స‌ద‌రు ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న పంజాబ్ లో చోటుచేసుకుంది. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. తరగతి గదిలోని ఎల్ సీడీ స్క్రీన్ పై అశ్లీల వీడియోను చూపించ‌డంతో పాటు ఆరో తరగతి విద్యార్థినులకు అసభ్యకరమైన సైగ‌లు చేసి చూపించిన ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న పంజాబ్ లోని ఫగ్వారాలో లో చోటుచేసుకుంది. 

పాఠశాలలో చ‌దువుతున్న ఒక‌ బాలిక కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో బాలిక‌ తండ్రి ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు రాజీవ్ శర్మను అరెస్టు చేసినట్లు సత్నాంపురా ఎస్ హెచ్ వో గురిందర్జిత్ సింగ్ తెలిపారు. నిందితుడు గోవింద్ పురా మొహల్లాలోని ప్రభుత్వ మిడిల్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.