ఝార్ఖండ్ లో ఓ కీచక టీచర్ 13యేళ్ల బాలికపై అమానుషానికి ఒడిగట్టాడు. ఇతని అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కీచక టీచర్ పదమూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై విషమిచ్చి హత్య చేశాడు.
ఝార్ఖండ్ లో ఓ కీచక టీచర్ 13యేళ్ల బాలికపై అమానుషానికి ఒడిగట్టాడు. ఇతని అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కీచక టీచర్ పదమూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై విషమిచ్చి హత్య చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఝార్ఖండ్ లోని పలమౌ జిల్లాలోని పంకికి చెందిన ఓ బాలిక జనవరి 26న స్కూలుకు వెళ్లింది. కాగా, ఆ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న శంభు సింగ్ (35) బాలిక మీద కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఎవ్వరూ లేని తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అత్యాచారానికి తెగబడ్డాడు.
ఈ విసయం పోలీసులకు తెలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికను, ఆమె తల్లిదండ్రులను బెదిరించాడు. అయితే ఆ దుర్మార్గుడు అంతటితో ఆగలేదు. అదే రోజు రాత్రి విద్యార్థిని ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. బాలికకు బలవంతంగా విషపు గోలీలు తినిపించాడు.
దీంతో బాలిక స్పృహ తప్పి పడిపోయింది. తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు విచారణలో పోలీసులకు మరో విషయం తెలిసింది. బాలిక కుటుంబానికి, ఉపాధ్యాయుడికి మధ్య భూతగాదాలు ఉన్నట్లుగా వారి విచారణలో తేలింది.
