రోజురోజుకూ చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. దేవాలయం లాంటి పాఠశాలలో చిన్నారుల మీద లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఒకేరోజు ఇలాంటి రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు కీచక ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై : వేరువేరు చోట్ల పాఠశాల girl studentsను Sexual harassmentలకు గురి చేసిన ఉపాధ్యాయుడు, former headmasterని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కోవై అన్ననూర్ ప్రాంతానికి చెందిన బాలిక (10) ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మాణిక్య సుందరం (47) ఈ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు తెలిసింది. దీని మీద బాధిత బాలిక ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది.
దీంతో ప్రధానోపాధ్యాయుడు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్ స్పెక్టర్ నిత్యా కేసు నమోదు చేసి మాణిక్య సుందరంను pocso act కింద అరెస్ట్ చేశారు. అలాగే పొల్లాచి భద్రకాళి అమ్మన్ ఆలయం వీధికి చెందిన ఎబినేసర్ (74) పాఠశాలలో హెచ్ఎంగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు ఇతను పొల్లాచ్చికి చెందిన 6యేళ్ల బాలిక మీద లైంగిక వేదింపులకు పాల్పడినట్లు బాధితురాలి తల్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. నేరం నిర్థారణ కావడంతో నిందితుడిని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా, Biharలో దారుణం జరిగింది. అధికార మదమెక్కిన ఓ
Sarpanch నీచానికి దిగజారాడు. గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లపై Sexual harassmentకు పాల్పడ్డాడు. అంతేకాదు దీన్ని వ్యతిరేకించిందని ఆ ముగ్గురిలో ఓ అమ్మాయి noiseను పదునైన ఆయుధంతో కోసేశాడు. ఈ ఘటన బీహార్‌లోని సుపాల్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధ్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఆ గ్రామ సర్పంచ్ ముస్తాకిన్ తన సొంత గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వేదింపులకు వ్యతిరేకంగా ముగ్గురిలోని ఓ బాలిక నిరసన వ్యక్తం చేయడంతో, కోపంతో రగిలిపోయిన సర్పంచ్ పదునైన ఆయుధంతో ఆమె ముక్కును కోసాడు. తీవ్ర రక్తస్రావం జరుగుతుండడంతో గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు సర్పంచ్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాగా, మరోవైపు సర్పంచ్ కూడా పోలీస్ స్టేషన్ లో బాలికల తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశాడు. తనపై, తన మద్దతుదారులపై బాలికల కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపిస్తూ సర్పంచ్ పోలీస్ స్టేషన్ లో కంప్టైంట్ ఇచ్చాడు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి ఘటనే మార్చి 17న చెన్నైలో జరిగింది. పాఠాలు భోదిస్తూ మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రొఫెసర్ పాడుబుద్ధితో విద్యార్థినిపై కన్నేశాడు. తన కోరిక తీర్చాలని బాలికను హింసించేవాడు. చివరికి student వాటిని తట్టుకోలేక ప్రొఫెసర్ పై కళాశాల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఉదాంతం tamilnaduలో చోటు చేసుకుంది.
తమిళనాడులో కన్యాకుమారి కళాశాలలో ఓ యువతి చదువుతోంది. ఆ కళాశాలలోని ప్రొఫెసర్ గా పని చేస్తున్న వాసుదేవన్ విద్యార్థినిపై కన్నేశాడు. ఎలాగో ఒకలా ఆమె phone number సంపాదించాడు. ఇక ఆ రోజు నుంచి ఆమెను అసభ్యకరమైన smsలు, videoలను పంపుతూ తరచూ వేధించేవాడు. అతని కోరికలని తీర్చాలని సదరు విద్యార్థినిని Physically, mentallyగానూ తీవ్ర ఇబ్బందులు పెట్టేవాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు.. ఆమె తన సోదరుడిని ఈ దారుణాన్ని చెప్పుకుంది.
