Ananthapuri Hindu Mahasammelanamలో పాల్గొన్న కేరళ సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సమాజంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కేరళ సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం Ananthapuri Hindu Mahasammelanamలో పాల్గొన్న పీసీ జార్జ్ పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సమాజంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముస్లింలు నిర్వహించే రెస్టారెంట్‌లలో విక్రయించే టీలో ‘‘నపుంసకత్వానికి కారణమయ్యే చుక్కలు’’ ఉన్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు వంధ్యత్వంకు సంబంధించిన మందులను పానీయాల్లో కలుపుతున్నారని అన్నారు. దేశంపై నియంత్రణ ఆశతో పురుషులు, స్త్రీలను వంధ్యత్వం చేయడానికి ఇది జరిగిందని అన్నారు.
రాష్ట్రంలోని ముస్లిమేతరులు.. ముస్లింలు నిర్వహించే రెస్టారెంట్లకు వెళ్లకుండా ఉండాలనికోరారు. ముస్లింలు తమ జనాభాను పెంచి ముస్లిం దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ముస్లిం మత గురువులు మూడుసార్లు ఉమ్మివేసి ఆహారాన్ని పంపిణీ చేస్తారు. ముస్లింలు ఆహారంలో ఉమ్మివేసి వడ్డిస్తారని ఆరోపించారు. వారి ఉమ్మును మనం ఎందుకు తినాలని ప్రశ్నించారు. ముస్లిం వ్యాపారులు ముస్లిమేతర ప్రాంతాల్లో తమ సంస్థలను స్థాపించి వారి సంపదను దోచుకుంటారని అన్నారు.
పీసీ జార్జ్ చేసిన వ్యాఖ్యలు ముస్లిం సమాజం మనోభావాలు దెబ్బతీసేలా, మత విద్వేషాలను వ్యాప్తి చేసేలా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీస్ చీఫ్ అనిల్ కాంత్ ఆదేశాల మేరకు తిరువనంతపురం పోర్టు పోలీసులు పీసీ జార్జ్‌పై సుమోటోగా చర్యలు తీసుకున్నారు. ఆయనపై ఐపీసీలో సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం పీసీ జార్జ్‌ను పోలీసులు ఆయన ఇంటి నుంచి అదుపులోకి తీసుక్నారు.
ఇక, పీసీ జార్జ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని బీజేపీ నేతల ఖండించారు. కుమ్మనం రాజశేఖరన్ మాట్లాడుతూ.. కేరళలో జార్జ్ చెప్పినట్లుగానే చాలా జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ మాట్లాడుతూ.. పోలీసులు చర్య తీసుకోవడం సరైనదే.. విద్వేషపూరిత ప్రసంగాలు అల్లర్లకు దారితీస్తాయని అన్నారు. కేరళలోని అధికార పార్టీ కూడా జార్జ్ అతని వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఇక, జార్జ్ 33 సంవత్సరాల పాటు Poonjar అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
పీసీ జర్జ్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి..
దేవాలయాలను హిందూ పాలనలోకి తీసుకురావాలి. స్థానిక హిందువులతో కూడిన కమిటీలు ఆలయాన్ని నిర్వహించాలన్నారు. చర్చి, మసీదులు.. క్రైస్తవ, ముస్లిం కమిటీల క్రింద ఉన్నాయి. అలాంటప్పుడు హిందువులపై వివక్ష ఎందుకు..? అని ప్రశ్నించారు. భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని కూడా కోరారు. ‘‘హిందూత్వమే అసలైన సంస్కృతి. ఇది బహుళ మతాలు, బహుళ సంస్కృతులను కలుపుతుంది. ప్రజాస్వామ్యం ఎవరికైనా ఏదైనా చేసే స్వేచ్ఛను ఇచ్చింది. మేము లోకా సమస్తా సుఖినోభవంతు అని నమ్ముతాము. కాబట్టి హిందూ సంస్కృతికి అండగా నిలిచే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి’’ అని అన్నారు.
ముస్లిం అమ్మాయిలు... హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలు తగిన ముస్లిం అబ్బాయిలను కలవడానికి సహాయం చేస్తారని.. తద్వారా లవ్ జిహాద్‌ను సులభతరం అవుతుందని ఆరోపించారు. తాను మతాంతర వివాహాలకు వ్యతిరేకం కాదని.. హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను మతం మార్చడానికి ఉద్దేశపూర్వక చేసే ట్రాప్‌కు వ్యతిరేకం అని అన్నారు.
తాను లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు.. వారు తనను ఉద్దేశపూర్వకంగా ఓడించారని ఆరోపించారు. హిందువులు సమావేశాలు నిర్వహించేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారని.. ముస్లిం కుట్రలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి వారు ఇష్టపడరని చెప్పారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించడాన్ని పీసీ జార్జ్ ప్రశంసించారు. దేవాలయాలతో పాటు మసీదుల్లో లౌడ్ స్పీకర్లను యోగి నిషేధించారని.. ఇది ఎంతో గౌరవప్రదమైన నిర్ణయం అని పేర్కొన్నారు.
