Asianet News TeluguAsianet News Telugu

నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ కి చుక్కెదురు

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీలకు మరోసారి చుక్కెదురైంది.

Tax Assessment For Sonia, Rahul Gandhi To Continue, Says Supreme Court
Author
Hyderabad, First Published Dec 4, 2018, 3:42 PM IST


నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీలకు మరోసారి చుక్కెదురైంది.ఈ కేసుకు సంబంధించి 2011-12 సంవత్సరంలో సోనియా, రాహుల్‌ ఆదాయపన్ను వివరాలను పునఃపరిశీలన చేసేందుకు సుప్రీంకోర్టు ఐటీశాఖ అధికారులకు అనుమతిని ఇచ్చింది. 

అయితే..ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సోనియా, రాహుల్ లు సుప్రీంని ఆశ్రయించారు. కాగా.. ఈ రోజు కేసు వాదనకు వచ్చింది. మంగళవారం ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రస్తుత దశలో కేసులో జోక్యం చేసుకోలేమని చెప్పింది. జనవరి 8వ తేదీన ఈ కేసు తుది విచారణ చేపడతామని సుప్రీం స్పష్టం చేసింది.

నేషనల్ హెరాల్డ్ ఆస్తుల విషయమై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సోనియా, రాహుల్ లకు వ్యతిరేకంగా కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios