భోపాల్: ఒంటికాలితో 43 రోజుల్లో 3800 కి.మీ సైకిల్ పై ప్రయాణం చేసిన తాన్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొంది.ఒంటికాలితో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తాన్య సైకిల్ పై ప్రయాణం చేశారు. శారీరకంగా వికలాంగులైన విద్యార్ధులకు పారా స్పోర్ట్స్ పై అవగాహన కల్పించి, విరాళాలు సేకరిస్తోంది. 

ఇందులో భాగంగా ప్రతి ఏటా ఇన్పినిటీ రైడ్ ను నిర్వహిస్తోంది. ఈ రైడ్  కార్యక్రమంలో 9  మంది సభ్యుల టీమ్ లో తాన్య ఒక్కరే ఫిమేల్ పార సైక్లిస్ట్  కావడం విశేషం.43 రోజుల పాటు 3800 కి.మీ. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర పూర్తి చేసింది తాన్య.  ఇంత దూరం పాటు ఒంటికాలిపై సైకిల్ యాత్ర చేసిన రికార్డు తాన్య నెలకొల్పారు.

2018లో డెహ్రాడూన్ లో ఏంబీఏ చదివే రోజుల్లో రోడ్డు ప్రమాదంలో తాన్య కుడికాలును కోల్పోయింది. ఆ తర్వాత పారా స్పోర్ట్స్ పౌండేషన్ లో ఆమె చేరింది.గత ఏడాది నవంబర్ 19న కాశ్మీర్ నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. అదే ఏడాది డిసెంబర్ 18న యాత్ర హైద్రాబాద్ కు చేరిన సమయంలో తండ్రి మరణవార్త తెలుసుకొని ఆమె యాత్ర మధ్యలో అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి యాత్రలో పాల్గొంది.