ఆ సమయంలో యువతి ఒక్కతో ఇంట్లో ఉంది. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని.. నిందితుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు
22ఏళ్ల యువతిని మాయ చేసి ఓ మాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి శరీరంలో చెడు ఆత్మ ఉందని.. దానిని తొలగిస్తానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన అజ్మీర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఘటనలో నిందితుడిని రాజేంద్ర కుమార్ వాల్మీకి(49) గా పోలీసులు గుర్తించారు. నిందితుడు ఢిల్లీకి చెందినవాడిగా గుర్తించారు. కాగా.. బాధితురాలి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఏదో వివాహానికి హాజరయ్యారు. కాగా... ఆ సమయంలో యువతి ఒక్కతో ఇంట్లో ఉంది. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని.. నిందితుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు
కాగా.. ఇలా పలుమార్లు బాధితురాలిపై నిందితుడు.. తనలోని చడెు ఆత్మను నాశనం చేస్తానంటూ నమ్మించి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందుతుడిని పోలీసులు అరెస్టు చేశారు.
