Exorcism Ritual: మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ భూతవైద్యులు తాంత్రిక పూజ‌లు నిర్వ‌హించారు. ఓ మ‌హిళతో క‌ర్మ‌లు చేస్తున్న వీడియో బయటపడింది. జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా, ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులకు నోటీసులు అందజేస్తామని ఆరోగ్య అధికారులు తెలిపారు. 

Exorcism Ritual:  నేటి కాలంలో.. శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ది చెందింది. రాళ్ల రాపిడితో నిప్పును పుట్టించిన దశ నుంచి రాకెట్‌ యుగం వరకు ఎన్నో నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలు మానవుడి జీవన పయనాన్ని మర్చివేశాయి. అయినా ఇంకా కొంతమంది ప్రజలు మూఢ నమ్మకాలతోనే జీవిస్తున్నారు

ఆనారోగ్యం పాలైన ఓ మహిళ ఆస్ప‌త్రి పాలైంది. కానీ.. ఆరోగ్య కుదుటప‌డ‌పోవ‌డంతో ఆమె కుటుంబ స‌భ్యులు తాంత్రికుడితో పూజలు నిర్వహించారు. అది కూడా ఆస్ప‌త్రిలో నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని అశోక్​నగర్​లో శుక్రవారం జరిగింది. కాగా ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ విష‌యం ఉన్న‌త వైద్యాధికారుల‌కు తెలియ‌డంతో ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులకు నోటీసులు అందజేశారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని అశోక్​నగర్​ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉన్న మహిళపై నీళ్లు కొడుతూ పూజలు చేస్తున్న వీడియో వైరల్​గా మారింది. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డీకే భార్గవ స్పందించారు. ఈ చర్యను కట్టడి చేయనందుకుగాను ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యులకు నోటీసులు ఇస్తామని తెలిపారు.

అశోక్​నగర్​లోని ఓ ప్రాంతంలో కచ్చియా బాయి అహిర్వార్ అనే 65 ఏళ్ల మహిళ​ నివసిస్తోంది. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆమె అస్వస్థతకు గరైంది. దీంతో శుక్రవారం ఆమెను అశోక్​నగర్​లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులైనా ఆమె ఆరోగ్యం కుదట‌ప‌డ‌క‌పోవ‌డంతో మహిళకు దుష్ట శక్తులు ఉన్నాయని నమ్మిన కుటుంబ సభ్యులు ఓ భూత‌వైద్యుడుని తీసుకువచ్చి ఆస్పత్రిలోనే పూజలు నిర్వహించారు. ఈ చ‌ర్య‌ల‌కు అడ్డుకున్న ఆస్ప‌త్రి సిబ్బందితో కూడా వాగ్వాదానికి దిగారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై విచారణ చేపడుతామని చీఫ్​ మెడికల్​ హెల్త్​ ఆఫీసర్​ నీరజ్​ ఛరి తెలిపారు.

ఎదురైనప్పుడు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు మరియు మహిళకు దుష్టశక్తులు పట్టుకున్నందున ఆచారాలు అవసరమని అతను చెప్పాడు. ఉద్దేశించిన వీడియోలో, తాంత్రికుడు తన అరచేతిలో నీటిని తీసుకొని కొన్ని మంత్రాలు పఠించడం ద్వారా మహిళ ముఖంపై విసిరినట్లు కనిపించాడు.