తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం....ఏడుగురు మృతి

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 1, Sep 2018, 11:27 AM IST
tamilnadu road accident
Highlights

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సును మితిమీరిన వేగంతో ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఏడుగురి ప్రాణాలను బలితీసుకుంది. 
 

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సును మితిమీరిన వేగంతో ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఏడుగురి ప్రాణాలను బలితీసుకుంది. 

సేలం జిల్లాలో ఈ ప్రమాదం సంభవించింది. సేలం నుండి ధర్మపురికి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు ప్రయాణికులను తీసుకువెళుతోంది. ఈ క్రమంలో మామంగం వద్ద ఈ బస్సును ఎదురుగా అతి వేగంగా వచ్చిన ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో బస్సులోని ఏడుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. మరో 26 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొదట గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  
 

loader